Breaking News

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాక్.. పెరిగిన టికెట్ ధరలు

Published on Sat, 04/01/2023 - 18:44

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికులపై టీఎస్‌ఆర్టీసీ మరో భారం మోపింది. ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జాతీయ రహదారులపై టోల్‌ చార్జీలను అయిదు శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. శనివారం నుంచి ఆ నిర్ణయం అమల్లోకి రానుండటంతో ఆర్టీసీపై మరింత భారం పడనుంది. పెరిగిన టోల్‌ చార్జీల భారాన్ని ప్రయాణికులపైనే వేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. 

ఈ మేరకు ఆర్టీసీ టికెట్‌లో వసూలు చేసే టోల్‌ ఛార్జీలను పెంచింది. టోల్ ఛార్జీలను పెంపుతో టికెట్ ధరలు సైతం పెరిగాయి. ఆర్డీనరి నుంచి గరుడ ప్లస్ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 వరకు పెంచినట్లు ప్రకటించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ.15 పెంచింది. ఏసీ స్లీపర్ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్ ఛార్జీ రూ.20 వసూలు చేస్తున్నారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే సిటీ ఆర్డినరీ బస్సుల్లో రూ.4 పెంచారు. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి.
చదవండి: కేసీఆర్‌ది కొంపముంచే సర్కార్‌: బండి సంజయ్‌

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)