Breaking News

మహిళలు, బాలికలపై దాడులు పెరగడం సిగ్గుచేటు

Published on Mon, 12/30/2024 - 05:38

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై గతంలోకంటే ఇప్పుడు దాడులు పెరిగా యని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల రేటు 22.5 శాతం పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94 శాతం పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసు లు నమోదయ్యాయని వివరించారు.

మహిళలపై అఘా యిత్యాలకు సంబంధించి రాష్ట్రంలో రోజుకు సగటున 8 కేసు లు నమోదవుతున్నాయని, ఇందులో 82 శాతం మైనర్‌ బాలి కల అపహరణ కేసులు నమోదవడం సిగ్గుచేటని అన్నారు. ఇవన్నీ గమనిస్తే.. కాంగ్రెస్‌ పాలనలో మహిళలకు భద్రత లేదని స్పష్టమవుతోందని, ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందని ఆయన ధ్వజమెత్తారు. అంబర్‌పేటలో రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ గంగారెడ్డి, ఆయన భార్య హత్య (నాలుగు నెలల క్రితం) కేసు ఇంకా పరి ష్కారం కాలేదని, ఆర్నెల్లక్రితం హత్యకు గురైన బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి కేసులో కూడా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో 163కి పైగా ప్రధాన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, రూ.10 కోట్ల విలువైన ఆర్థిక మోసాలకు సంబంధించి రికవరీ జరగలేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో నేరాల గుర్తింపు రేటు 31 శాతంగా ఉందని, ఈ విషయంలో బిహార్‌లాంటి రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు గోల్డెన్‌ పీరియడ్‌ స మయాన్ని వృథా చేయడం వల్ల బాధితులకు న్యాయం జర గడం లేదని పేర్కొన్నారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగు తున్న పరిస్థితి పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి నైపుణ్యాన్ని, శక్తిని కోల్పోతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి సీఎం రేవంత్‌రెడ్డే కారణమని హరీశ్‌రావు అన్నారు.

కాంగ్రెస్‌ పాలనలో విద్యార్థులు బతికితే చాలనుకుంటున్నారు: మాజీ మంత్రి హరీశ్‌రావు 
సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పాలనలో పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లలో పెడుతున్న బువ్వ తమ కొద్దని, ఇక్కడ తాము ఉండలేమంటూ విద్యార్థులు తల్లిదండ్రులను వేడుకుంటున్నారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతోందన్నారు.

అనంతపేట్‌ కేజీబీవీలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన దుస్థితి బాధాకరమని, విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యారి్థని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటని హరీశ్‌ దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్‌ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్, సిరిసిల్లలో కానిస్టేబుల్‌ కుటుంబం, మెదక్‌ కుల్చారంలో హెడ్‌ కానిస్టేబుల్‌.. ఇలా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. పని ఒత్తిడి, పెండింగ్‌ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే పోలీసులపై తీవ్ర ప్రభావం పడుతోందని హరీశ్‌రావు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)