Breaking News

పేదరికం బీసీలకు పెద్ద శాపం

Published on Wed, 01/11/2023 - 02:49

అమీర్‌పేట: పేదరికం బీసీలకు పెద్ద శాపమని, బీసీల్లో చాలా మంది చదువుకోలేక పోతున్నా­రని హైకోర్టు న్యాయ­మూర్తి జస్టిస్‌  సూరెపల్లి నంద ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సమాజ్‌ ఆధ్వర్యంలో అమీర్‌పేటలో మంగళవారం నిర్వహించిన  ‘బీసీ ఉమెన్‌ సింపోజియం’లో జస్టిస్‌ నంద మాట్లాడా­రు. పనిలో ఇచ్చే వేతనం మహిళలకు తక్కువగా ఉంటుందని,  ఉద్యోగాలు, ప్రమోషన్లలో సైతం వివక్ష చూపిస్తున్నారని అన్నారు.

మహిళలకు చదువు చెప్పిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందని..  ఇంట్లో అమ్మ చదువుకుంటే అందరూ చదువుకు­న్నట్లేనని పేర్కొన్నారు. విద్య అన్నిటికంటే ముఖ్యం కాగా రెండో ముఖ్యమైన రంగం రాజకీ­య­మన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాజకీయ సాధికారతకు నిదర్శనమన్నారు.

కూతురే కావాలంటున్నారు: ఈటల  
కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ .. ఇప్పుడు ట్రెండ్‌ మా­రింది. అబ్బాయి వద్దు.. అమ్మాయి కావాలని చా­లా మంది తల్లిదండ్రు­లు కోరుకుంటున్నారని చె­ప్పా­­రు. ఏ తల్లి కుటుంబాన్ని పట్టించుకుంటుందో ఆ కుటుంబమే బాగు­పడుతుందన్నారు. దేశంలో వ్యవసాయం ఇంకా ఉందంటే అది మహి­ళల శ్రమవల్లేనని అ­న్నా­రు. జ్ఞానం, సంస్కారం కులాన్ని బట్టి రావనీ, చైతన్యానికి, ఐక్యత­కు, పోరాటానికి కులం లేదని చెప్పారు. కార్యక్ర­మంలో రెండు రాష్ట్రాలకు చెందిన  మహిళలు పాల్గొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)