Breaking News

ఉచిత ప్రయాణంపై పిల్‌.. ప్రయోజనం లేదన్న కోర్టు

Published on Wed, 01/31/2024 - 18:11

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో  ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. బస్సులన్ని మహిళలతోనే నిండిపోతున్నాయని  టికెట్‌ తీసుకున్నా సీటు ఉండటం లేదని నాగోలుకు చెందిన హరిందర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సులలో తీవ్ర రద్దీ పెరిగిందని పిటీషన్‌లో పేర్కొన్నారు.

కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు బస్సులో నిలబడే పరిస్థితి లేదని హైకోర్టుకు తెలిపారు. ఉచిత ప్రయాణం కోసం జారీ జారీ చేసిన జీఓ 47ను రద్దు చేయాలని హరిందర్ పిటిషన్‌లో కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ తెలంగాణ హైకోర్టు హరిందర్‌ దాఖలు చేసిన పిటీషన్‌లో ఎటువంటి ప్రజా ప్రయోజనమేమీ లేదని పేర్కొంది.

పిటిషనర్ బస్సులో ఇబ్బంది ఎదుర్కొని పిల్ దాఖలు చేశారని ధర్మాసనం తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటీషన్‌గా మార్చాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)