Breaking News

లారీని ఢీకొట్టిన కారు.. తల్లి, బిడ్డ దుర్మరణం!

Published on Mon, 04/20/2026 - 13:31

మహబూబ్ నగర్: అతివేగం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. వెనక నుంచి ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టడంతో తల్లి, ఐదు నెలల కుమారుడు మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున అడ్డాకుల శివారులోజాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లికి చెందిన ప్రకాష్‌రెడ్డి భార్య నందిని (21), ఐదు నెలల కుమారుడు కన్నయ్యతో కలిసి యాదగిరిగుట్ట దైవదర్శనానికి తెల్లవారుజామున కారులో బయలుదేరాడు.

 మార్గమధ్యలో అడ్డాకుల శివారులోని స్నేహ పరిశ్రమ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంకు సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు అతివేగంగా ఢీకొట్టుకుంది. ప్రమాదంలో కారు ఎడమ సీట్లో కూర్చున్న నందిని తల భాగం పూర్తిగా ఛిద్రమై రోడ్డుపై పడింది. నందిని ఒళ్లో కూర్చున్న బాలుడు కారు ముందు భాగంలో ఇరుక్కుని ప్రాణాలు వదిలాడు. ఇక కారు డ్రైవింగ్‌ సీట్లో ఉన్న ప్రకా‹Ùరెడ్డి సీటు బెల్టు ధరించడంతో ఎయిర్‌ బెలూన్‌ తెరుచుకున్నప్పటికీ తీవ్రంగా గాయపడ్డాడు. 

సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఘటన స్థలానికి చేరుకొని తల్లీకొడుకుల మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రకాష్ రెడ్డిని అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా కేంద్రానికి పంపించారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఏదైనా వాహనాన్ని ఓవర్‌ టెక్‌ చేసే క్రమంలో ఎడమ వైపు వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీ వెనుక ఢీకొట్టాడా.. నిద్రమత్తులో ప్రమాదం జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది. మెరుగైన చికిత్స కోసం ప్రకాష్‌రెడ్డిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినట్లు తెలిసింది. బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.   

చెప్పులే ప్రమాదానికి కారణమా! 
కారు నడిపేటప్పుడు ప్రకాష్‌రెడ్డి తాను ధరించిన శాండిల్స్‌ను డ్రైవింగ్‌ సీటు వద్దే వదిలాడు. వేగంగా వెళ్తున్న క్రమంలో ముందు వెళ్తున్న వాహనాన్ని దాటే ప్రయత్నంలో బ్రేక్‌ వేయడానికి ప్రయతి్నంచిన సమయంలో శాండిల్స్‌ బ్రేక్‌ పెడాల్‌ కిందకి వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనివల్లే బ్రేక్‌ వేయడానికి వీలు కాకపోవడంతో కారు వెళ్తున్న వేగంతోనే లారీని ఢీకొట్టి ఉంటుందని, అందువల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. లారీని కారు తగిలే సమయంలో బ్రేక్‌ వేసి ఉంటే ప్రమాద తీవ్రత ఇంత ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. డ్రైవింగ్‌ చేసే సమయంలో కాళ్ల వద్ద చెప్పులు, వాటర్‌ బాటిళ్లు, ఇతర వస్తువులు పెట్టొద్దని, గతంలో కూడా ఇలాగే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని నిపుణులు అంటున్నారు.  


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)