Breaking News

ఘోరం.. కొడుకు, కుమార్తెను ఉరేసి చెరువులో పడేసిన తండ్రి

Published on Tue, 01/06/2026 - 08:06

సాక్షి,హైదరాబాద్‌: పిల్లా,పాపలతో హాయిగా సాగిపోతున్న సంసారంలో కుటుంబ సమస్యలు ఘోర విషాదాన్ని నింపాయి. కొడుకు,కుమార్తెను ఉరేసి చెరువులో పడేశాడో తండ్రి. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మరికల్ మండలం తీలేరు గ్రామంలో మంగళవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన శివరాములు తన కూతురు రితిక, కొడుకు చైతన్యను ఉరిసే స్థానిక చెరువులో పడేశాడు. అనంతరం, విద్యుత్ తీగను పట్టుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు స్పందించి అతడిని మహబూబ్ నగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల మృతదేహాలను చెరువులో నుండి వెలికితీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తీలేరు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సమస్యల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, చిన్నారుల అమాయక ప్రాణాలు ఇలా బలైపోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

తీలేరు గ్రామంలో జరిగిన ఈ ఘటన కుటుంబ సమస్యలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో మరోసారి స్పష్టంచేసింది. శివరాములు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండగా, గ్రామం మొత్తం ఈ దారుణంతో కన్నీటి సంద్రమైంది. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)