Breaking News

ఫిల్మ్‌నగర్‌ పాపం.. ట్రాఫిక్‌ పోలీసులదే..!

Published on Wed, 01/29/2025 - 09:05

కొందరు అవినీతి ‘తెల్ల’ఖాకీల నిర్లక్ష్యం... ఓ లారీ డ్రైవర్‌ నిర్వాకం... వెరసీ.. ఓ కుటుంబాన్ని పెను విషాదంలో నింపాయి. ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసి కనీసం కన్నవారికి ‘ముఖం’ చూసే అదృష్టం కూడా లేకుండా చేశాయి. మంగళవారం (Tuesday) ఉదయం షేక్‌పేట ఆంజనేయస్వామి దేవాలయం వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం పదేళ్ల చిన్నారి అథర్వి ఉసురుతీసింది. ఈ పాపం కచ్చితంగా ట్రాఫిక్‌ పోలీసులదేనని చెప్పక తప్పదు.  

ఉత్తర్వులు ఉత్తవేనా? 
హైద‌రాబాద్‌ (Hyderanad) నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్‌ ఇబ్బందుల దృష్ట్యా అధికారులు అనేక ఆంక్షలు విధించారు. ఈ మేరకు గత ఏడాది ఫిబ్రవరి 20న ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ప్రవేశించే అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.  

10 టన్నుల కంటే మించొద్దు.. 
ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన కమర్షియల్‌ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు. లోకల్‌ లారీలతో పాటు నిర్మాణ సామగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. డీసీఎం, ఐచర్, స్వరాజ్‌ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్‌ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువుతో కూడినవి) మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే తిరగాలి.  

కాసులు కురిపించడమే కారణమా? 
షేక్‌పేటలో చిన్నారిని చిదిమేసిన లారీ పంచదార లోడ్‌తో ప్రయాణిస్తోంది. ఇది కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు మాత్రమే నగరంలో తిరగాలి. అయితే.. ప్రమాదం చోటు చేసుకున్న 8.10 గంటలకు అది నగరంలోనే ఉంది. ఈ తరహా లారీలే కాదు... నగరంలో మరికొన్ని వాహనాలు తిరుగుతూ కొందరు ట్రాఫిక్‌ పోలీసులకు కాసులు పండిస్తున్నాయి. అక్కడ నుంచి మట్టి తరలించే, నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను తీసుకువచ్చే వాటిని ‘వదిలేయడం’ కోసం యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

రాత్రయితే చాలు రాకాసులే.. 
ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం చాలా కీలకమైంది. నగర శివార్లలో ఉన్న, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో ఉన్న అనేక కార్యాలయాలు, పాఠశాలలకు చెందిన బస్సులు, వాహనాలతో ఆ రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. అలాంటి సమయంలోనూ ఓ లారీ మృత్యు శకటంగా దూసుకొచ్చిందంటే దానికి కారణం అయితే మామూళ్ల మత్తయినా అయి ఉండాలి.. లేదంటే నిబంధనలు అతిక్రమించిందంటూ ‘ఉక్కుపాదం’ మోపిన ట్రాఫిక్‌ పోలీసులు ఓ చలానా రాసి వదిలేసైనా ఉండాలనే వాదన వినిపిస్తోంది. 

చదవండి:  ‘మమ్మీ బాయ్‌..’

ఈ రెంటిలో ఏది జరిగినా ఆ పాపం మాత్రం కచ్చితంగా ట్రాఫిక్‌ పోలీసులదే. నగరంలోకి పగలంతా లారీల ప్రవేశం లేకపోవడంతో రాత్రయిందంటే చాలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తాయి. వాయు వేగంతో దూసుకుపోయే ఇవి రాకాసులుగా మారుతున్నాయి. ఆ సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు సైతం పాయింట్స్‌లో ఉండకపోవడంతో విజృంభిస్తున్నాయి.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)