అక్కడ ట్రాఫిక్ జామ్... ఇలా వెళ్లండి !

Published on Sat, 06/21/2025 - 13:58

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ప్రధాన రహదారి­లోని ఓ ప్రాంతంలో ధర్నా, మరో రోడ్డులో యాక్సి­డెంట్‌ జరిగింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. ఈ విషయం సీసీ కెమెరాలు, హైరైజ్‌ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ట్రాఫిక్‌ పోలీసు­లకు తెలుస్తుంది. కానీ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహన చోదకులకు తెలియదు. దీంతో వారు ఆ ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. అలా కాకుండా ముందే ఆ విషయం తెలిస్తే..మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళతారు. హైదరాబాద్‌ పోలీసులు–­గూగుల్‌ ఇండియా ప్రతినిధులు కసరత్తు చేశారు. కొన్ని మార్గాల్లో ప్రయోగాత్మకంగా కూడా అమలు చేశారు. త్వరలో హైదరాబాద్‌ అంతా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. 

జంక్షన్‌లో మూడు, నాలుగు రోడ్లు 
సాధారణంగా ప్రతి ట్రాఫిక్‌ జంక్షన్‌లోనూ మూడు, నాలుగు రోడ్లు ఉంటాయి. ఒక్కో రోడ్డుకు నిర్ణీత సమయం గ్రీన్‌ లైట్, రెడ్‌ లైట్‌ వెలుగుతూ ‘సిగ్నల్స్‌ సైకిల్‌’నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు. అయినా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సైకిల్‌లో మార్పు ఉండదు. అలా ఉండా­లం­టే వాటిని క్షేత్రస్థాయి సిబ్బంది మాన్యువల్‌గా ఆపరేట్‌ చేయాలి. ఇలాంటి అనేక సమస్యలకు గూ­గుల్‌ సంస్థ పరిష్కారం చూపనుంది. హైదరాబాద్‌ పోలీసులు–గూగుల్‌ ఇండియా ప్రతినిధులు కొన్ని జంక్షన్లు, రూట్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తు­న్న విధానం త్వరలోనే నగరవ్యాప్తంగా అమలు కానున్నట్టు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ శుక్రవారం ప్రకటించారు. 

ఐటీఎంఎస్‌ సహకారంతో సిగ్నలింగ్‌ 
ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అనుసంధానించి ఉండే సర్వర్‌కు ఏ జంక్షన్‌లోని.. ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్‌ ఉంది అనేది సాంకేతికంగా తెలుస్తుంది. దీనికోసం ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలో (ఐటీఎంఎస్‌) అడాఫ్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోలింగ్‌ సిస్టం (ఏటీ­సీఎస్‌) విధానం అమలవుతుంది. ఈ విధానంలో ఓ మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానం అవుతాయి. ఆయా చౌరస్తాల్లో ఎటు నుంచి ఎంత ట్రాఫిక్‌ వస్తుందనేది లెక్కించడానికి అవసర­మైన పరిజ్ఞానం ట్రాఫిక్‌ కెమెరాల్లో ఉంటుంది. ఇవన్నీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అను­సంధానించి ఉంటాయి. అక్కడి సర్వర్‌లో ఉండే సాఫ్ట్‌­వేర్‌ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏఏ మార్గాల్లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటే ఆ రూట్లకు ఎక్కువ సేపు గ్రీన్‌లైట్‌ పడేలా చేస్తుంది. అయితే గరిష్టంగా 100 సెకన్లు మాత్రమే ఇది ఉంటుంది. ఆపై రొటేషన్‌పై సిగ్నల్‌ సైకిల్‌ మొదలవుతుంది.

మ్యాప్స్‌ ద్వారానే అలర్ట్స్‌ కూడా...
ఇప్పటికే గూగుల్‌ మ్యాప్స్‌లో ఆయా మార్గాల్లో ఉన్న రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న సెల్‌ఫోన్ల ద్వారా ఈ రద్దీని గూగుల్‌ సంస్థ గుర్తిస్తోంది. ట్రాఫిక్‌ పోలీసుల డేటాతో గూగుల్‌ సర్వర్‌ అనుసంధానం చేస్తు­న్నా­రు. ఇలా నగరంలోని వివిధ మార్గాల్లో ఉన్న వా­హ­నాల రద్దీ వివరాలు గూగుల్‌కు చేరతాయి. ఎక్కడైనా ట్రాఫిక్‌ జామ్‌ అయినా, రోడ్డు ప్రమా­దం జరిగినా, నిరసన కార్యక్రమం ఉన్నా కూడా తెలుస్తా­యి. ఈ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే గూగుల్‌ సర్వర్‌ మ్యా­ప్స్‌కు అనుసంధానం చేస్తుంది. త­ద్వారా ఆయా మార్గాల్లో ప్రయాణి­స్తున్న వాహనచోదకులను గుర్తించడంతోపాటు ట్రాఫిక్‌ జామ్‌పై అలర్ట్‌ ఇస్తుంది. దా­దా­ç­³# రెండు­మూడు కిలోమీటర్ల ముందే ఈ సమాచారం ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాన్నీ సూ­చి­స్తుంది. ఈ విధానం అమలు­లోకి వస్తే సిగ్నల్స్‌ అన్నీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని (సీసీసీ) సర్వర్‌ ఆధారంగా పని­చేస్తాయి. కేవలం అవసరమైనప్పుడు మాత్రమే జంక్షన్లను మా­న్యువల్‌గా ఆపరేట్‌ చేస్తారు. 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు