Breaking News

రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే ఎన్నికలకు

Published on Mon, 09/08/2025 - 00:36

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించిన తర్వాతే ఎన్నికలకు వెళతామని టీపీ సీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఆలస్యమైనా సరే రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధిస్తామన్నారు. బీసీలకు అన్యా యం చేస్తున్న బీజేపీ బండారాన్ని బయటపెట్టి, రిజర్వేషన్లకు అడ్డుతగిలేవారి భరతం పట్టేందుకు ఈనెల 15న కామారెడ్డి లో రెండు లక్షల మందితో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి వేదికగా చేసిన డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న వాగ్దానం మేరకు తాము అధికారంలోకి రాగానే శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసి, బీసీల జనాభా లెక్కలు తేల్చామన్నారు. దీని ప్రకారం బీసీలు 56.33 శాతం మంది ఉన్నట్లు తేలిందని, అందుకు అనుగుణంగా స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం సాధించిందని పేర్కొన్నారు. అయితే ఆ బిల్లును గవర్నర్‌ కేంద్రానికి పంపితే అక్కడ చట్టం చేయడానికి సహకరించాల్సిన బండి సంజయ్, కిషన్‌రెడ్డి అడ్డు తగులుతున్నారన్నారు.   

అమలు చేసి తీరుతాం..
‘కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావులు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడితే అర్థం ఉంటుంది కానీ, బండి సంజయ్‌ మున్నూ రు కాపు.. అయినా దేశ్‌ముఖ్‌లా వ్యవహరిస్తున్నారు’అని మహేశ్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి.. రెడ్డి అయినా బీసీల కోసం కష్టపడుతున్నారన్నారు. ధర్మపురి అర్వింద్‌ బీసీ ల గురించి మాట్లాడడం లేదని, ఈటల రాజేందర్‌ ముఖం చాటేశారని విమ ర్శించారు. బండికి పౌరుషం ఉంటే మోదీ, అమిత్‌షాలను ఒప్పించి రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు ఎన్నికల్లో దేవుడి పేరుతో ఓట్లడుక్కునే బిచ్చగాళ్ల ని ఆయన విమర్శించారు.ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, మదన్‌ మోహన్‌రావు, తోట లక్ష్మీకాంతరావు, భూపతిరెడ్డి, ఆది శ్రీని వాస్, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)