Breaking News

సినీగేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత

Published on Sat, 09/07/2024 - 02:32

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌)/ సిరిసిల్ల కల్చరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్‌ వడ్డేపల్లి కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 76 ఏళ్లు. లలిత గీతాల రచయితగా, టెలివిజన్‌ ధారావాహికల దర్శకుడిగా, గేయ రచయితగా, వివిధ డాక్యుమెంటరీలు, ఆడియో ఆల్బమ్స్‌ రూపకర్తగా ఆయన ప్రసిద్ధి చెందారు. తెలుగు సినీ పరిశ్రమలో రచయితల సంఘానికి ఆయన విశిష్ట సేవలందించారు. నంది పురస్కారాల కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కాగా, అమెరికా నుంచి ఆయన కుమారుడు రావాల్సి ఉండటంతో కృష్ణ భౌతికకాయాన్ని నిమ్స్‌ మార్చురీలో భద్రపరిచారు. కృష్ణ మరణ వార్త గురించి తెలిసి పలువురు కవులు, కళాకారులు, రచయితలు నిమ్స్‌కు వచ్చి నివాళులర్పించారు. తెలంగాణ బీసీ కమిషన్‌ తొలి చైర్మన్‌ బి.ఎస్‌.రాములు సంతాపం తెలిపారు. 

రెండు రోజుల క్రితమే జీవన సాఫల్య పురస్కారం
రెండు రోజుల క్రితమే తెలుగు సినీ రచయితల సంఘం వడ్డేపల్లి కృష్ణను జీవన సాఫల్య పురస్కారంతో సత్క రించింది. అమెరికాలో ఆటా సభల్లో పాల్గొనడానికి వెళ్లి న ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో జూలై 16న హైద రాబాద్‌ వచ్చి ఆసుపత్రిలో చేరారు. నెల రోజులు ఆసు పత్రిలోనే ఉండి నాలుగు రోజుల క్రితం డిశ్చార్జ్‌ అయ్యా రు. మళ్లీ ఇబ్బంది అనిపించడంతో మరోసారి నిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. వడ్డేపల్లి కృష్ణ సిరిసిల్లలో చేనేత కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్‌ నాగోల్‌లో స్థిరపడ్డారు. తొలుత తపాలా శాఖలో ఉద్యోగం చేశారు. వందేళ్లలో వెలువడిన పది వేల లలిత గీతాలను పరిశీలించి పీహెచ్‌డీ పూర్తి చేశారు. పిల్ల జమీందార్, భైరవద్వీపం, పెద్దరికం తదితర చిత్రాలకు రాసిన పాటలకు ఆయనకు మంచి పేరు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరు వాత జయ జయహే తెలంగాణ నృత్య రూపకం రచించా రు. కృష్ణ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)