Breaking News

హైదరాబాద్‌– విజయవాడ హైవే.. ఏ వాహనానికి ఎంత టోల్‌ చార్జీ?

Published on Tue, 04/01/2025 - 17:38

టోల్‌ ప్లాజాల్లో సవరించిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రకటించింది. హైదరాబాద్‌– విజయవాడ మార్గంలోని నేషనల్‌ హైవే–65పై టోల్ చార్జీలు త‌గ్గ‌గా, తెలంగాణ (Telangana) మీదుగా సాగే ఇతర జాతీయ ర‌హ‌దారుల‌పై మాత్రం చార్జీలు పెరిగాయి.

వరంగల్‌– హైదరాబాద్‌ బైపాస్‌ రోడ్డుపై టోల్‌ ప్లాజాల్లో చార్జీలు..  
→ కారు, జీపు, వ్యాన్, లైట్‌ మోటార్‌ వాహనం ఒక వేపు రూ.125, అప్, డౌన్‌ రూ.190, లైట్‌ కమర్షియల్‌ వాహనం, లైట్‌ గూడ్స్‌ వాహనం, మినీ బస్సు రూ.205, అప్, డౌన్‌ రూ.305, బస్సు, ట్రక్కుకు ఒక వైపు రూ.425, అప్, డౌన్‌ రూ.635, కమర్షియల్‌ వాహనం ఒక వైపు రూ.465, అప్, డౌన్‌ రూ.695, హెచ్‌సీఎం, ఈఎంఈ వాహనం ఒకవైపు రూ.665, అప్, డౌన్‌ రూ.1,000, ఓవర్‌సైజ్‌ వాహనం ఒక వైపు రూ.810, అప్, డౌన్‌ రూ.1,215, నెలవారీ పాస్‌ (Monthly Pass) ధర రూ.340 నుంచి రూ.350కి పెరిగింది.  

ఎన్‌హెచ్‌–44పై ఇందల్వాయి టోల్‌గేట్‌ వద్ద ఇలా.. 
→ నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్‌ లేదా లైట్‌ మోటార్‌ వాహనాలకు సింగిల్‌ జర్నీకి రూ. 90గా టోల్‌ చార్జీ ఖరారైంది. అలాగే 24 గంటల్లోపు రిటర్న్‌ జర్నీకి రూ. 135, 50 సింగిల్‌ జర్నీలతో కూడిన మంత్లీ పాస్‌కు రూ. 3,035, టోల్‌ప్లాజాకు 20 కి.మీ. పరిధిలో ఉండి రిజిస్టర్‌ చేసుకున్న వాహనాలకు మంత్లీ పాస్‌ రూ. 350కు పెరిగాయి. 

→ లైట్‌ కమర్షియల్‌ వాహనాలు, లైట్‌ గూడ్స్‌ వాహనాలు, మినీ బస్‌లకు సింగిల్‌ జర్నీకి రూ. 145, 24 గంటల లోపు రిటర్న్‌ జర్నీకి రూ. 220, మంత్లీ పాస్‌కు రూ. 4905లకు పెరిగాయి. 

→ బస్‌లు, రెండు ఎక్సెల్‌ గల ట్రక్కులకు సింగిల్‌ జర్నీకి రూ. 310, 24 గంటల లోపు రిటర్న్‌ జర్నీకి రూ. 465, మంత్లీ పాస్‌కు రూ.10,280 లకు పెరిగాయి. 

→ హెవీ కన్‌స్ట్రక్షన్‌ వాహనాలు, ఎర్త్‌ మూవింగ్‌ వాహనాలు, మల్టీపుల్‌ ఎక్సల్‌ వాహనాలకు సింగిల్‌ జర్నీకి రూ.485, 24 గంటల లోపు రిటర్న్‌ జర్నీకి రూ.725, మంత్లీ పాస్‌కు రూ.16,120 లకు పెరిగాయి. 

చ‌ద‌వండి: హైదరాబాద్‌– విజయవాడ హైవేపై టోల్ చార్జీలు ఎందుకు త‌గ్గాయి?

→ ఏడు ఎక్సెల్‌లు కలిగి ఉన్న భారీ వాహనాలకు సింగిల్‌ జర్నీకి రూ. 590, 24 గంటల లోపు రిటర్న్‌ జర్నీకి రూ.885, మంత్లీ పాస్‌కు రూ. 19,625లకు చార్జీలు  (Charges)పెరిగాయి.

   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)