Breaking News

తిరుమల లడ్డూ ప్రసాదంలో పొగాకు ప్యాకెట్‌

Published on Mon, 09/23/2024 - 09:46

ఖమ్మంరూరల్‌: దేవదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం తీసుకొచ్చిన లడ్డూలో పొగాకుతో కూడిన ప్యాకెట్‌ రావడంతో భక్తులు నివ్వెరపోయిన ఘటన ఇది. ఖమ్మం రూరల్‌ మండలంలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ శివారు కార్తికేయ టౌన్‌షిప్‌కు చెందిన దొంతు పద్మావతి బంధువులతో కలిసి ఈనెల 19న తిరుమల వెళ్లారు. 

అక్కడ 20వ తేదీన సర్వదర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నాక లడ్డూలు కొనుగోలు చేయగా ఆదివారం తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. కాగా, ఉదయం లడ్డూ ప్రసాదాన్ని ఇంట్లో దేవుడి వద్ద ఉంచి బంధువులకు ఇచ్చేందుకు ముందు కొద్దిగా నోట్లో వేసుకోగా పొగాకు వాసన వచ్చింది. 

దీంతో పద్మావతి లడ్డూ మొత్తం చూడగా అందులో పొగాకుతో కూడిన ప్యాకెట్‌ కనిపించింది. కాస్త నమిలిన పొగాకును కాగితంలో చుట్టగా అది లడ్డూలో కలిసిపోయి ఉంది. దీంతో ఆమె పలువురికి చూపించగా పద్మావతితో పాటు వెళ్లిన మిగతా వారు తీసుకొచ్చిన వారు తెచ్చిన లడ్డూలు బాగానే ఉన్నాయి. కాగా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో ఇలా రావడంపై పద్మావతి సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తిరుమల లడ్డులో పొగాకు. చంద్రబాబు పై భక్తులు ఫైర్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)