Breaking News

తెలంగాణలో కారు జోరు.. 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు బీఆర్‌ఎస్‌కే.. 

Published on Tue, 10/03/2023 - 07:53

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ 9 నుంచి 11 సీట్లు గెలుచుకుంటుందని ‘టైమ్స్‌ నౌ’ తాజా సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో బీజేపీకి 2 నుంచి 3 సీట్లు, కాంగ్రెస్‌కు 3 నుంచి 4 సీట్లు లభిస్తాయని సర్వే నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్‌ సీపీ 24 నుంచి 25 స్థానాలు దక్కించుకుని ప్రభంజనం సృష్టిస్తుందని వెల్లడించింది. టీడీపీకి సున్నా నుంచి ఒక స్థానం రావొచ్చని పేర్కొంది.

ఏపీలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టైన తర్వాత ఈ సర్వే జరగడం గమనార్హం. జాతీయ స్థాయిలో అధికార ఎన్డీయేనే మరో సారి విజయం సాధిస్తుందని తెలిపింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ కూటమి 307 సీట్లు గెలుచుకుంటుందని.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష ‘ఇండి యా’ కూటమి 175 స్థానాలకే పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. 

తెలంగాణలో పెరిగిన బీఆర్‌ఎస్‌ బలం  
17 లోక్‌సభ స్థానాలున్న తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచింది. ఈసారి ఎన్నికల్లో 9 నుంచి 11 సీట్లు తన ఖాతాలో వేసుకోనుంది. బీజేపీకి 2 నుంచి 3, కాంగ్రెస్‌కు 3 నుంచి 4 సీట్లు లభిస్తాయి. ఇతరులు మరో స్థానం దక్కించుకోబోతున్నారు. 80 లోక్‌సభ సీట్లున్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయేకు 70 నుంచి 74 సీట్లు లభిస్తాయని సర్వే బహిర్గతం చేసింది. ఇండియా కూటమికి 4 నుంచి 8, బహుజన సమాజ్‌ పార్టీకి ఒకటి, ఇతరులకు ఒకటి నుంచి మూడు సీట్లు వచ్చే అవకాశం ఉందని  వెల్లడించింది. 

చదవండి: కేంద్రంలో మళ్లీ ఎన్డీయే ప్రభంజనం

Times Now Survey : ‘ఫ్యాన్‌’ ప్రభంజనం!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)