Breaking News

కోడలు వరకట్నం కేసు పెట్టిందని...

Published on Wed, 10/09/2024 - 08:48

రాంగోపాల్‌పేట్‌: భర్తతో పాటు అత్తా, మామలపైన కోడలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించడంతో మనస్థాపం చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు ట్యాబ్లెట్లు, ఇంజక్షన్‌ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నాగోల్‌కు చెందిన తోట భావనారాయణ (52), పద్మావతి (47) భార్యాభర్తలు, వీరి కుమారుడు సుజన్‌ (23). భావనారాయణ, సుజన్‌లు ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తుండగా పద్మావతి గృహిణి. సుజన్‌(23)కు కొత్తగూడెం చుంచుపల్లి ప్రాంతానికి చెందిన కావ్యశ్రీతో ఇదే ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన వివాహం చేశారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. 

దీంతో కావ్యశ్రీ ఇటీవల చుంచుపల్లి పోలీస్‌ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేయించింది. చుంచుపల్లి పోలీసులు సుజన్‌కు ఫోన్‌ చేసి తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్‌ కోసం రావాలని ఇటీవల కోరగా రెండు మూడు రోజులు టైం అడిగారు. మంగళవారం ఉదయం పోలీస్‌ స్టేషన్‌కు రావాలని మరో మారు పోలీసులు సూచించారు. దీంతో ఈ నెల 5వ తేదీ ఉదయం ఆన్‌లైన్‌ ద్వారా సికింద్రాబాద్‌ ప్రాంతంలోని తాజ్‌ ట్రైస్టార్‌ హోటల్‌ మూడవ అంతస్తులోని 308 గదిని బుక్‌ చేసుకుని ముగ్గురు అక్కడ దిగారు. సోమవారం రాత్రి కోడలు కావ్యశ్రీకి ఫోన్‌ చేసి కేసు విత్‌డ్రా చేసుకోవాలని, లేకపోతే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసికుంటామని చెప్పారు.

ఆ తర్వాత వారి మధ్య సంభాషణ ఏమి జరిగిందో తెలియదు కానీ..మంగళవారం ముగ్గురు డైజోఫాం ట్యాబ్లెట్లు, షుగర్‌కు వాడే ఇన్సులిన్‌ ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. ఉదయం 10.30 గంటల వరకు వీరి గది తలుపులు తెరవకపోవడంతో పాటు హోటల్‌ సిబ్బంది తలుపు కొట్టినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మరో తాళం చెవితో తాళం తెరిచి చూడగా ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో వెంటనే మహంకాళి పోలీసులకు సమాచారం అందించి వారిని యశోద ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పద్మావతి సోదరి అక్కడికి చేరుకుని ఆర్థిక పరిస్థితి బాగాలేదని గాం«దీకి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని వెల్లడించారు. మహంకాళి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)