Breaking News

థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో ముగ్గురి అరెస్ట్‌

Published on Mon, 12/09/2024 - 09:13

చిక్కడపల్లి: ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో ఈ నెల 4న జరిగిన తొక్కిసలాట..ఒకరి మృతి ఘటనలో థియేటర్‌ యజమాని, ఇద్దరు మేనేజర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చిక్కడపల్లి ఏసీపీ ఎల్‌.రమేష్‌ కుమార్, ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్, ఎస్‌ఐ మౌనికలు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఇక్కడ వారు మీడియాతో మాట్లాడుతూ థియేటర్‌లో ముందు రోజే భారీ హంగామా చేయడం, భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం వహించడం వల్లే రేవతి అనే మహిళ మృతిచెందినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. 

సినిమా నటులు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు వస్తున్నారన్న విషయం థియేటర్‌ నిర్వాహకులు తమకు తెల్పలేదన్నారు. విచారణ అనంతరం సంధ్య థియేటర్‌కు సంబంధించిన ఏడుగురు యజమానుల్లో ఒకరైన ముడుపు సందీప్, సీనియర్‌ మేనేజర్‌ నాగరాజు, అప్పర్, లోయర్‌ బాల్కనీని చూసుకునే మేనేజర్‌ గంధం విజయ్‌చందర్‌లను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరిస్థితిపై లీగల్‌ టీంను సంప్రదించి..తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్‌కు కూడా నోటీసులు ఇస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.  
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)