Breaking News

విశ్వక్సేన్‌ సోదరి ఇంట్లో భారీ చోరీ

Published on Sun, 03/16/2025 - 07:19

హైదరాబాద్‌: ఫిలింనగర్‌ రోడ్డునెంబర్‌–8లో నివసించే సినీ హీరో విశ్వక్సేన్‌(Vishwak Sen) సోదరి గదిలో భారీ చోరీ జరిగింది. ఈ మేరకు ఆమె తండ్రి సి.రాజు ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో(Filmnagar Police Station) ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజు కూతురు మూడో అంతస్తులో ఉంటుంది. తెల్లవారి తన గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి ఆమె ఆందోళన చెందింది. పరిశీలించగా రెండు బంగారు డైమండ్‌ ఉంగరాలతో(Diamond) పాటు ఒక హెడ్‌ఫోన్‌ కనిపించలేదు. దీంతో విషయాన్ని తన తండ్రి దృష్టికి తీసుకు వచ్చింది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్లూస్‌ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి  తెల్లవారుజామున 5.50 గంటల ప్రాంతంలో ఇంటి ముందు బైక్‌ పార్కు చేసినట్లుగా గుర్తించారు. సదరు వ్యక్తి గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లి వెనుక డోర్‌ నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అల్మరాలో నుంచి బంగారు వస్తువులు తస్కరించినట్లుగా గుర్తించారు. 

సరిగ్గా 20 నిమిషాల్లోనే దొంగిలించిన సొత్తుతో సదరు వ్యక్తి బయటకు రావడం, వెళ్లిపోవడం కూడా సీసీ ఫుటేజీలో నమోదైంది. చోరీకి గురైన బంగారం విలువ రూ.2.20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిలింనగర్‌ పోలీసులు దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికలపై దృష్టి పెట్టారు. పాత నేరస్తుల కదలికలను కూడా గమనిస్తున్నారు. ఇంత ధైర్యంగా గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లడం,  దర్జాగా బయటకు వెళ్లిపోవడం చూస్తుంటే ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందని భావిస్తున్నారు. ఫిలింనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు