Breaking News

బీజేపీలోకి స్వప్న?

Published on Sun, 06/15/2025 - 12:44

తాండూరు: మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నపరిమళ్‌ కాంగ్రెస్‌ను వీడి కాషాయదళంలో చేరనున్నారా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని అసంతృప్తిగా ఉన్న ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది తాండూరులో హాట్‌టాపిక్‌గా మారింది. పలువురు మాజీ కౌన్సిలర్లు సైతం స్వప్న బాటలో నడవనున్నట్లు సమాచారం.

మహేందర్‌రెడ్డి వర్గం నుంచి..
2020లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పట్నం మహేందర్‌రెడ్డి వర్గం నుంచి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా స్వప్న రేసులోకి వచ్చారు. మరో వైపు ఇదే పార్టీ నుంచి రోహిత్‌రెడ్డి వర్గం తరఫున పట్లోల్ల దీపనర్సింహులు చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేశారు. 36 వార్డులున్న తాండూరులో మహేందర్‌రెడ్డి వర్గీయులు ఎక్కువమంది కౌన్సిలర్లుగా గెలుపొందారు. దీంతో చైర్‌పర్సన్‌ కుర్చీ కోసం పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు పలువురు నాయకులు కల్పించుకుని, చైర్‌పర్సన్‌ పదవీకాలాన్ని ఇద్దరూ చెరి సగం పంచుకోవాలని సూచించారు. మొదటిసారి స్వప్నకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో దీపకు వైస్‌ చైర్‌పర్సన్‌ కుర్చీ ఇచ్చి బుజ్జగించారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, కోర్టు కేసుల నేపథ్యంలో పదవీ కాలమంతా స్వప్ననే కొనసాగారు. ఈ నేపథ్యంలో కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించిన ప్రతీసారి గొడవలే జరిగాయి.

రాష్ట్ర కమిటీ ఎన్నిక తర్వాతే..
గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత స్వప్న కాంగ్రెస్‌లో చేరారు. అయితే పదవీ కాలం ముగిసిన తర్వాత ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి ఆమెకు ఆహ్వానం ఆగిపోయింది. ఈ విషయమై తన సన్నిహితుల వద్ద పలుమార్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈక్రమంలోనే బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర కమిటీ నియామకం తర్వాతే కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు