Breaking News

విమాన టికెట్‌కు డబ్బుల్లేక.. వ్యభిచార కూపంలోకి..

Published on Mon, 05/05/2025 - 07:05

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): స్నేహితుడిని నమ్ముకుని భారత్‌కు వచ్చిన థాయ్‌లాండ్‌ యువతి మోసానికి గురైంది. తిరిగి తన స్వదేశం వెళ్లేందుకు విమాన టికెట్‌కు డబ్బులు లేక వ్యభిచారంలోకి దిగి పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. థాయ్‌లాండ్‌కు చెందిన యువతి (30)కి, చెన్నైకి చెందిన యువకుడికి ఇన్‌స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. 

అతడు రమ్మనడంతో గత మార్చిలో యువతి చెన్నైకి వచ్చేసింది. ఆమెను చెన్నైలోని ఓ హోటల్‌లో ఉంచి అతడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో యువతి హోటల్‌ బిల్లు చెల్లించలేక.. థాయలాండ్‌ వెళ్లలేక ఇబ్బందుల పాలయ్యింది. థాయ్‌లాండ్‌కు చెందిన స్నేహితురాలిని సంప్రదించింది. థాయ్‌లాండ్‌ నుంచి పలువురు మహిళలను వ్యభిచార వృత్తి కోసం భారత్‌కు పంపించే ఓ స్నేహితురాలు నగరంలోని యువతితో మాట్లాడించడంతో గత నెల 30న బాధితురాలు నగరానికి చేరుకుంది. 

శ్రీనగర్‌ కాలనీలో ఓ ప్లాట్‌లో మరో యువతితో కలిసి వ్యభిచారానికి పాల్పడింది. విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు దాడులు చేయగా బాధిత యువతి పట్టుబడింది. తనను బాయ్‌ఫ్రెండ్‌ మోసం చేశాడని, హోటల్‌ బిల్లు చెల్లించేందుకు, తిరిగి స్వదేశం వెళ్లిపోవడానికి విమాన చార్జీల కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే వ్యభిచార వృత్తిలోకి దిగినట్లు ఆమె తెలిపింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి ఆదివారం పునరావాస కేంద్రానికి తరలించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)