ప్రయాణికులకు TGSRTC బిగ్‌ షాక్‌.. బస్సు ఛార్జీల పెంపు!

Published on Sat, 10/04/2025 - 20:32

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక భారం మోయలేని తరుణంలో.. జంట నగరాల్లో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకుంది. పెరిగిన ఈ ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

సిటీ బస్సుల్లో సోమవారం(అక్టోబర్‌ 6వ తేదీ నుంచి) పెంచిన ఛార్జీలను.. అదనపు చార్జీల రూపంలో వసూలు చేయనున్నారు. మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 పెంపు, నాలుగో స్టేజ్‌ నుంచి రూ.10 పెంపు వర్తించనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఈ పెంచిన ఛార్జీలు వసూలు చేస్తారు. అలాగే.. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో, ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేస్తారు.  హైదరాబాద్‌, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు.  

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం  చర్యలు ప్రారంభించింది. రాబోయే రెండేళ్లలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని విధించేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 25 డిపోలు ఉన్నాయి. అందులో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా.. ఈ ఏడాదిలో అందుబాటులోకి రానున్న మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక భారాన్ని మోయలేం.. అందుకే చార్జీలు పెంచాల్సి వస్తోందని టీజీఎస్‌ఆర్టీసీ అంటోంది.
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)