Breaking News

ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు దగ్ధం

Published on Mon, 06/22/2026 - 06:17

తిమ్మాపూర్‌/విద్యానగర్‌: కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ శివారులో రాజీవ్‌ రహదారిపై కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. కరీంనగర్‌–2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సు (టీజీ 02టి1138) ఆదివారం ఉదయం 8 గంటలకు కరీంనగర్‌ బస్టాండ్‌ నుంచి ఇద్దరు చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఉదయం 8.20 గంటలకు అల్గునూర్‌ శివారులోని కాకతీయ కాలువ దాటాక బ్యాటరీలో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌ ప్రశాంత్‌ వెంటనే బస్సును రోడ్డు పక్క ఆపేశాడు.

బస్సు తలుపులు, ఎమర్జెన్సీ తలుపులు తెరిచి ప్రయాణికులను బయటకు పంపించాడు. బస్సులోని అగ్నిమాపక పరికరాలు ఉపయోగించి మంటలు ఆర్పేందుకు యత్నించాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో అదుపు తప్పాయి. ఐదు నిమిషాల్లోనే బస్సు మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

ఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.వెంకన్న, కరీంనగర్‌ జోన్‌ ఈడీ పి.సోలమన్, కరీంనగర్‌ ఆర్‌ఎం బి.రాజు, రవాణాశాఖ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌గౌడ్, డీటీసీ రవీందర్‌ పరిశీలించారు. డ్రైవర్‌ ప్రశాంత్‌ సమయస్ఫూర్తిని అభినందించి రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఎల్‌ఎండీ సీఐ రమేశ్, ఎస్‌ఐ అన్వర్‌ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. 

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)