రేపటి నుంచి తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు బంద్‌

Published on Sun, 09/14/2025 - 16:24

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రేపటి(సోమవారం, సెప్టెంబర్‌ 15వ తేదీ) నుంచి ఉన్నత విద్యాసంస్థలను బంద్‌ చేస్తున్నట్లు రాష్ట్ర హయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అసోసియేషన్‌ వెల్లడించింది.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి విద్యార్థులు ఎవరూ కాలేజీలకు రావొద్దని పిలుపునిచ్చింది. 

డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, నర్సింగ్‌ సహా అన్ని కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. టెన్త్‌ తర్వాత ఉన్న అన్ని కళాశాలల విద్యార్థుల తరగతులకు రావొద్దని పేర్కొంది. అదే సమయంలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలను సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీనిలో భాగంగా పరీక్షలను వాయిదా వేయాలని వర్సిటీలను కోరినట్లు తెలిపింది. విద్యార్థులు రేపటి నుంచి కళాశాలకు రావొద్దని, వాటికి తాళాలు వేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

ఫీజు రీయయింబర్స్‌మెంట్‌ బకాయిల నిలిపివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన అసోసియేషన్‌.. 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయనుంది. 20 రోజుల క్రితమే కాలేజీల బంద్‌పై సీఎస్‌కు నోటీస్‌ ఇచ్చామని, కనీసం 21లోగా రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లించాలని పేర్కొంది. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని, అక్టోబర్‌ 31వ తేదీ నాటికి రెండో విడత బకాయిలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్‌ చేసింది. ఇక డిసెంబర్‌ 31వ తేదీ నాటికి మొత్తం బకాయిలు చెల్లించాల్సిందేనని తమ డిమాండ్‌లో పేర్కొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ప్రతీ ఏడాది మార్చి 30లోగా చెల్లించేలా జీవో ఇవ్వాలని అసోసియేషన్‌ పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)