Breaking News

సిరిసిల్లలో ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్‌!

Published on Mon, 05/26/2025 - 13:52

సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్లలో బీఆర్ఎస్ నేత నిరసనల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య వాగ్వాదం, తోపులాట ాకారణంగా పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. అనంతరం, పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.

వివరాల ప్రకారం.. సిరిసిల్లలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించారు. ప్రోటోకాల్ పాటించాలని అడిగితే క్యాంపు కార్యాలయంపైకి దాడికి వస్తారా అంటూ బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా పోలీసులు చేసిన లాఠీచార్జీ చేసి ఇరుపక్షాలను చెదరగొట్టారు. పోలీసుల లాఠీచార్జిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జంగం చక్రపాణితోపాటు పలువురు నాయకులు గాయపడ్డారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏక పక్షంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించీ రాస్తారోకో చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నేతలను తంగలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)