Breaking News

వానలకు గాలుల చెక్‌!

Published on Sat, 07/11/2026 - 05:56

ఓవైపు మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌ వంటి రాష్ట్రాలు ఎడతెరిపిలేని వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు తెలంగాణ మాత్రం వరుణుడి కరుణ లేక విలవిల్లాడుతోంది. ప్రస్తుతం రుతుపవనాల కదలిక నెమ్మదిగా ఉంది. ఆకాశం మేఘావృతంగా కనిపించినప్పటికీ.. బలమైన ఉపరితల గాలుల ప్రభావంతో వర్షాల నమోదు ఆశించినంతగా లేదు. 

గత వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు మినహా పొడి వాతావరణమే కనిపించింది. ఈనెల 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉంటుందని.. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, చిరుజల్లులు కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతో ఈ ఆరు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు అధికంగా నమోదు కావచ్చని పేర్కొన్నారు.  

ప్రతి మేఘం వర్షించదు.. 
ఆకాశంలో కనిపించే ప్రతి మేఘం వర్షాన్ని కురిపించదు. వర్షం కురవాలంటే మేఘాలు నిలువుగా 10–15 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించాలి. వాటిలో తగినంత తేమ ఉండాలి. గత వారం రోజులుగా తెలంగాణపై పరుచుకున్న మేఘాల్లో చాలా వరకు మధ్యస్థాయి, ఎత్తయినవే ఉన్నాయి. అయితే, ఇవి ఎండను తగ్గిస్తాయి కానీ వర్షాన్ని ఇవ్వవు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల గాలులు చాలా బలంగా వీస్తున్నాయి. వర్షం కురిసేందుకు మేఘాలు కేంద్రీకృతమవక ముందే, ఈ గాలులు వాటిని వేగంగా వేరే ప్రాంతాలకు చెదరగొడుతున్నాయి.

 ఒడిశా తీరంలో ఏర్పడిన వాయుగుండం ఒక బలమైన వ్యాక్యూమ్‌లా పనిచేసింది. దీని వల్ల వాతావరణ పీడనంలో తీవ్రమైన వ్యత్యాసం ఏర్పడి, నైరుతి రుతుపవన గాలులను అది తనవైపునకు బలంగా లాక్కుంది. తెలంగాణ మీదుగా గంటకు 60–70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడానికి ఇదే ప్రధాన కారణం. అలాగే రుతుపవనాలకు సంబంధించిన ’లో–లెవల్‌ జెట్‌’ (వాతావరణంలో కింది స్థాయిలో వీచే అత్యంత వేగవంతమైన గాలుల ప్రవాహం) కోర్‌ భాగం తెలంగాణ మీదుగానే పయనిస్తోంది. అయితే, ఇవి భూమికి సమాంతరంగా అత్యంత వేగంగా వెళ్లడంతో వాటి తీవ్రత వల్ల మేఘాలు ఏర్పడే ప్రాథమిక దశలోనే చెదిరిపోయి వానలు పడటంలేదు. 

తేమ తగ్గి గాలి పొడిగా మారడం 
పశ్చిమ కనుమలలో భారీ వర్షాలు కురిపించిన తర్వాత, ఈ వేగవంతమైన పశ్చి మ గాలులు తెలంగాణ వైపు కిందికి దిగుతాయి. ఇలా కిందికి దిగే క్రమంలో గాలి వేడెక్కి, అందులోని తేమశాతం అకస్మాత్తుగా పడిపోతుంది. ఈ పొడి వాతావరణం కొత్త మేఘాల ఏర్పాటును అడ్డుకుంటుంది. అలాగే వర్షం కురవాలంటే వాతావరణంలోని తేమ ఒకచోట చేరి నిలకడగా ఉండాలి. కానీ, ఈ అతివేగపు గాలులు కన్వేయర్‌ బెల్ట్‌లా పనిచేస్తూ, గాలిలోని కొద్దిపాటి తేమను కూడా తెలంగాణలో నిలవనివ్వకుండా వాయుగుండం వైపు వేగంగా లాగేసుకుంటున్నాయి. అందుకే పశ్చి మ కనుమలలో వర్షాలు పడుతున్నా, మేఘాలతో వాతావరణం అనుకూలంగా కనిపిస్తున్నా.. మనకు వర్షాలు రావడం లేదు.

వేగవంతమైన గాలుల వల్లే.. 
రాష్ట్రంలో వాతావరణం చల్లబడినప్పటికీ.. వానలు కురవకపోవడానికి వేగంగా వీస్తున్న గాలులే ప్రధాన కారణం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత తగ్గి అల్పపీడనంగా మారింది. ఒకట్రెండు రోజుల్లో సాధారణ వాతావరణం ఏర్పడుతుంది. ఈసారి వానలు కురవకపోవడంలో ప్రధాన కారణం ఎల్‌నినో పరిస్థితులని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈనెలలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే తక్కువ వర్షాలు కురుస్తాయి. 
– శ్రీనివాసరావు, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సీనియర్‌ సైంటిస్ట్‌   

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)