Breaking News

పూటకో మాట.. రోజుకో తీరు

Published on Sat, 10/04/2025 - 08:15

సాక్షి, హైదరబాద్‌: తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌ బోర్డుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ తీరు ప్రజలకు అంతుచిక్కడం లేదు. ఫ్లై ఓవర్‌ ఒకవైపు (పాత సచివాలయం వైపు) ప్రవేశ మార్గంలో గత మంగళవారం ప్రజలకు దర్శనమిచ్చిన బోర్డును సాయంత్రానికి అక్షరాలు కనిపించకుండా తెర వేశారు. తెలుగుతల్లిగా ఉన్న పేరును తెలంగాణ తల్లిగా మార్చడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో జీహెచ్‌ఎంసీ చేసిన ఆ పనితో పలు సంశయాలు వెల్లువెత్తాయి.

 సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ఫ్లై ఓవర్‌ రెండో వైపు(లోయర్‌ట్యాంక్‌బండ్‌) ప్రవేశమార్గంలో  కూడా బోర్డు ఏర్పాటు చేశాక రెండింటినీ కలిపి ఒకేసారి ప్రారంభిస్తామని జీహెచ్‌ఎంసీ బుధవారం  ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు రోజుల్లో రెండింటినీ కలిపి ఒకేసారి  ప్రారంభిస్తామని పేర్కొంది. కానీ.. రెండో వైపు బోర్డు ఏర్పాటు కాకుండానే సచివాలయం వైపు బోర్డుకు వేసిన తెరను తొలగించి, తిరిగి అక్షరాలు కనిపించేలా చేసింది. 

ఇంతమాత్రానికి ఈ తతంగమంతా ఎందుకు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఒకవైపు మాత్రమే ఏర్పాటు చేస్తే ఎవరైనా కాదన్నారా? ఎందుకు మూసేశారు?  రెండోవైపు ఏర్పాటు కాకున్నా మళ్లీ ఎందుకు తెర తీశారు?  రెండూ ఒకేసారి ప్రారంభిస్తామని ఎందుకు ప్రకటించారు? అంటూ  పలువురు జీహెచ్‌ఎంసీ చర్యల్ని  తప్పుపడుతున్నారు.   

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి