Breaking News

అలాంటి కాల్స్‌లో 90% మోసపూరితమే

Published on Mon, 01/27/2025 - 06:21

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ నంబర్లతో వచ్చే ఫోన్‌కాల్స్‌లో 90 శాతం వరకు మోసపూరితమైనవేనని టెలీకమ్యూనికేషన్స్‌ విభాగం వెల్లడించింది. టెలీకమ్యూనికేషన్స్‌ విభాగం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన సంచార్‌సాథీ మొబైల్‌యాప్‌తో వీటికి అడ్డుకట్ట వేయగలుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ చేస్తున్న ఫోన్‌కాల్స్‌ను ఆధునిక టెక్నాలజీ వాడి భారతీయ నంబర్ల మాదిరిగా కనిపించేలా చేసి కూడా మోసాలకు పాల్పడుతున్నట్టు వారు వివరించారు. వాస్తవానికి మనకు ఫోన్‌కాల్‌ వచ్చినప్పుడు ఆ నంబర్‌.. భారతీయ ఫోన్‌ నంబర్‌ +91తో మొదలైనట్టుగా కనిపించినా, అవన్నీ అంతర్జాతీయ ఫోన్‌కాల్సే అని అధికారులు పేర్కొన్నారు.

ఇలాంటి ఫేక్‌కాల్స్‌పై వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు ఇటీవల టెలీకమ్యూనికేషన్స్‌ విభాగం సంచార్‌సాథీ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదు మేరకు ఆయా నంబర్లను బ్లాక్‌ చేస్తున్నారు. ఇందుకు అన్ని టెలికాం సర్విస్‌ ప్రొవైడర్లతో కలిసి టెలికమ్యూనికేషన్ల విభాగం ఇంటర్నేషనల్‌ ఇన్‌కమింగ్‌ స్పూఫ్డ్‌ కాల్స్‌ ప్రివెన్షన్‌ సిస్టం అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. గతంలో దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 1.35 కోట్ల స్పూఫ్డ్‌ ఫోన్‌కాల్స్‌ వచ్చేవని, ఇటీవల స్పూఫ్డ్‌ కాల్స్‌ ప్రివెన్షన్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గినట్టు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం స్పూఫ్డ్‌ కాల్స్‌ రోజుకు సుమారు 4 లక్షలవరకు మాత్రమే వస్తున్నట్టు వెల్లడించారు. ఇలాంటి ఫోన్‌కాల్స్‌ను కట్టడి చేయడం సైబర్‌నేరాల నియంత్రణలో కీలకమని అధికారులు చెపుతున్నారు. కాగా, మొబైల్‌ వినియోగదారులు సంచార్‌ సా మొబైల్‌ యాప్‌ గూగుల్‌ప్లే స్టోర్, యాపిల్‌యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ను వాడి అనుమానాస్పద నంబర్లను వెంటనే బ్లాక్‌ చేసే వీలుంటుందని వారు పేర్కొంటున్నారు.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)