Breaking News

బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు

Published on Sat, 03/11/2023 - 15:01

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. కవితపై బండి వ్యాఖ్యల్ని సుమోటాగా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించింది. బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది. ఆయన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని తెలిపింది.

లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత.. ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కవితపై విమర్శలు చేశారు. చట్టం ముందు అందరూ ఒక్కరే అని అన్నారు. ఇదే సమయంలో కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది.

సంజయ్‌ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ అయ్యి ఉండి ఇలాంటి కామెంట్స్‌ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆందోళనలు చేశారుు. బండి సంజయ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మ దహనం చేశారు.
చదవండి: బీజేపీ, బీఆర్‌ఎస్ రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ లిక్కర్ స్కాంపై చర్చ

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)