Breaking News

హైదరాబాద్‌లో కుండపోత వాన.. హెచ్చరికలు జారీ

Published on Sat, 04/29/2023 - 06:33

సాక్షి, హైదరాబాద్‌: నగరాన్ని Hyderabad Rains మరోసారి వరుణుడు ముంచెత్తాడు. పొద్దుపొద్దున్నే ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వాన నగరవాసుల్ని పలకరించింది. రోడ్లు, లోతట్టు పప్రాంతాలు జలమయం అయ్యాయి.  వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరవాసులకు జీహెచ్‌ఎంసీ హెచ్చరికలు జారీ చేసింది. 

అమీర్‌పేట, కోఠి, పంజాగుట్ట, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్ కంటోన్మెంట్,  బేగంపేట్,  వారసిగూడ,  అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో ఇలా.. నగరంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ వర్ష ప్రభావం కనిపిస్తోంది. మరోవైపు వడగండ్ల వాన హెచ్చరికలూ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు సూచిస్తోంది. 

తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు, వడగండ్ల వాన ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జంట నగరాలు వానకి తడిచి ముద్దైంది. తెల్లవారినా కూడా మబ్బులు కమ్ముకుని చిమ్మచీకట్లు అలుముకోగా.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో కురుస్తోంది.

రాళ్ల వాన(వడగండ్ల) నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు జిల్లాల్లోనూ భారీ వర్షాలు, వడగండ్లకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు రామచంద్రపురం ఆమీన్పూర్ లో భారీ వర్షం కురుస్తోంది. మహాబూబ్‌నగర్‌లో పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతోంది. రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్‌ జిల్లాలకు వడగండ్లతో కూడిన భారీ వాన హెచ్చరికలు జారీ అయ్యాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)