Breaking News

విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డు నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం పై సంతకాలు తీసుకోవాలి

Published on Thu, 01/01/2026 - 22:42

హైద్రాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల రేటు తగ్గించడమే లక్ష్యంగా జనవరి 1 గురువారం నుండి 31 జనవరి వరకు జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 26 వేల రోడ్డు ప్రమాదాలు ,8 వేల మరణాలు సంభవిస్తుండగా ప్రతి రోజు 22 మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా అధికారుల తలకు హెల్మెట్ తొడిగారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు పోస్టర్ ను, వాహనాల స్టికర్ ను , విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అవగాహన బుక్స్ రిలీజ్ చేశారు. రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పై ఆటో లకు పోస్టర్ అతికించారు.  విద్యార్థుల తో రోడ్ సేఫ్టీ పై ఫ్లకార్డులు పట్టుకొని అవగాహన కల్పించారు.

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం ,డ్రంక్ అండ్ డ్రైవ్,రాంగ్ రూట్ లో రావడం , మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులు ప్రతి పాఠశాల వెళ్ళి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నుండి ఒక్క ప్రాణాన్ని కాపాడిన జీవితం సార్థకమవుతుందన్నారు. ఈ సంవత్సరం సడక్ - సురక్ష జీవన్ సురక్షా నినాదంతో కార్యక్రమాన్ని 4 ఈ ద్వారా ముందుకు తీసుకుపోతున్నామని వెల్లడించారు. ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎమర్జెన్సీ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బాక్స్ స్పాట్స్ తొలగించి ప్రమాదాలను నివారించాలని అధికారులకు తెలిపారు.

ఇది కేవలం రవాణా శాఖ,ఆర్టీసీ మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు, ఆర్ అండ్ బి,విద్యా శాఖ ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకొని నెల రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.రవాణా శాఖ అధికారులు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో రోడ్డు నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం తీసుకోవాలనీ ఆదేశించారు. రాష్ట్రంలో వెయ్యి మంది రవాణా శాఖ అధికారులు ఉంటే కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు స్వీయ నిర్వహణ పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని వాహనాలపై లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు పై నిరక్ష్యాన్ని వీడాలని హెచ్చరించారు.

ఆర్టీసీ కళా భవన్ లో రోడ్ సేఫ్టీ మంత్ కార్యక్రమాన్ని ప్రారంభించి గత 30 సంవత్సరాలుగా డ్రైవింగ్ చేస్తున్న ఒక్క ప్రమాదం కూడా జరగని డ్రైవర్లను అభినందించి సత్కరించారు. ఆర్టీసీ లో 20 వేల మంది డ్రైవర్లు ,10 వేల బస్సులు ప్రతి రోజు 60 లక్షల మంది ప్రయాణికులు ,39 లక్షల కిలోమీటర్లు లైఫ్ లైన్ అని కొనియాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ 2026 లో పాత బకాయిలు పోయి మరింత లాభాల్లోకి వచ్చేలా అందరం కృషి చేద్దామని వెల్లడించారు.ఆర్టీసీ ప్రమాదాలను జీరో కి తగ్గించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ వాహనాల ఫిట్నెస్ ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కమర్షియల్ వాహనాలను కట్టడి చేయాలని సూచించారు. హెవీ డ్రైవర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని , వైద్య పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు  మెదక్ జిల్లా కలెక్టర్ ప్రమాదాలను నివారించడానికి  ఒక సంవత్సర కాలంలో 100 బ్లాక్ స్పాట్ గుర్తించి తొలగించారని అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొనాలని సూచించారు..

ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ లో ప్రతి లక్ష కిలోమీటర్లకు 0.07 శాతం ప్రమాదాలు ఉన్నాయని, సంవత్సర కాలంలో 600 ప్రమాదాలు జరిగాయని తెలిపారు.ప్రమాదాలు తగ్గించడానికి ప్రతి డిపో లో డ్రైవర్లకు శిక్షణ ఇవ్వడం , బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయడం, సిబ్బందికి వైద్య పరీక్షలు , బస్సుల ఫిట్నెస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాలు శాశ్వత వికలాంగులు అయిన వారి కుటుంబాలు జీవితాంతం ఇబ్బందులు పడుతున్నాయన్నారు.ఆర్టీసీ ప్రతి సంవత్సరం 80 కోట్లు ప్రమాద బీమా చెల్లించడం జరుగుతుందనీ వెల్లడించారు.

కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జెటిసి లు చంద్రశేఖర్ గౌడ్, రమేష్ , శివలింగయ్య, డీటీసీ లు , స్టేట్ ఆర్టీఏ మెంబర్ నవీన్ ,జిల్లా ఆర్టీఏ సురేష్ లాల్ పాల్గొన్నారు

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)