తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డ బిడ్డలు!

Published on Fri, 07/31/2026 - 08:50

కన్నతండ్రి చివరి ప్రయాణానికి కూడా ఆస్తి లెక్కలు అడ్డుగా నిలిచాయి. జీవితాంతం పిల్లల కోసం కష్టపడిన ఓ తండ్రి మృతదేహం.. వారసుల మధ్య వివాదానికి సాక్షిగా మారింది. ఆస్తి పంపకాలపై పేచీ తేలేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ కొడుకులు పట్టుబట్టడంతో.. సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన సమాజంలో బంధాల విలువపై తీవ్ర చర్చకు దారితీసింది.

సాక్షి, సూర్యాపేట: అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుడిగ భద్రయ్య మృతి చెందగా.. ఆయన అంత్యక్రియలకు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదం అడ్డుగా మారింది. ఆస్తి పంపకాల విషయంలో స్పష్టత వచ్చే వరకు తండ్రి అంత్యక్రియలు జరగనివ్వబోమని కన్నబిడ్డలు పట్టుబట్టారు.

చివరి వీడ్కోలుకూ వారసత్వ వివాదం అడ్డం
సాధారణంగా తల్లిదండ్రుల చివరి చూపు కోసం కుటుంబం మొత్తం ఒక్కటవుతుంది. కన్నీళ్లతో వీడ్కోలు పలకాల్సిన సమయంలో.. ఇక్కడ మాత్రం ఆస్తి తగాదా తెరపైకి వచ్చింది. తండ్రి మృతదేహం ముందు కూడా వివాదం పరిష్కారం కాకపోవడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి.

పురుగుల మందు డబ్బాలతో.. 
వివాదం తీవ్రరూపం దాల్చడంతో కొందరు వారసులు పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడతామని బెదిరించారు. దీంతో ఆ విషాద వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. పంచాయితీ పెద్దలు, బంధువులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

బంధాల కంటే ఆస్తే ముఖ్యమా?
జీవితమంతా పిల్లల భవిష్యత్‌ కోసం శ్రమించిన తల్లిదండ్రులకు చివరి దశలో కూడా ప్రశాంతత దక్కకపోవడం విషాదకరం. ఆస్తులు, ఆస్తి పంపకాల కోసం బంధాలు బలహీనపడుతున్నాయా? అనే ప్రశ్నను ఈ ఘటన మరోసారి తెరపైకి తెచ్చింది. తండ్రి అంతిమ సంస్కారాలు సైతం వివాదానికి వేదికగా మారడం స్థానికుల్లో ఆవేదన కలిగించింది.

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)