Breaking News

తొలి విడత పంచాయతీ లెక్క తేలింది

Published on Tue, 12/02/2025 - 02:17

సాక్షి, హైదరాబాద్‌: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఐదు సర్పంచ్‌ స్థానాలతోపాటు, 133 వార్డులకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) తెలిపింది. అయితే ఇక్కడ నామినేషన్లే పడకపోవడంతో ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయింది. బుధవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఏకగ్రీవమయ్యే సర్పంచ్, వార్డు స్థానాలతోపాటు ఎంతమంది బరిలో ఉంటారనే దానిపై స్పష్టత వస్తుందని ఎన్నికల అధికారులు చెప్పారు. మొత్తంగా చూస్తే తొలివిడత ఎన్నికల్లో...4,236 గ్రామపంచాయతీల్లో (5 మినహాయించి) 4,231 సర్పంచ్‌ పదవులకు 22,330 నామినేషన్లు, 37,440 వార్డు స్థానాల్లో 37,179 (133 మినహాయించి) స్థానాలకు 85,428 నామినేషన్లు దాఖలైనట్టుగా స్పష్టత వచ్చింది. 

నామినేషన్లలో నల్లగొండ జిల్లా టాప్‌  
నల్లగొండ జిల్లాలో 318 పంచాయతీలకుగాను అత్యధికంగా 1,950 మంది సర్పంచ్‌ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. సగటున ఒక్కో పదవికి 6 గురు పోటీ పడుతున్నారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా నమోదయ్యాయి. ఇక్కడ 48 పంచాయతీలకు కేవలం 273 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోనే ఇది అత్యల్పం. 

వార్డుల్లోనూ నల్లగొండే... 
వార్డు సభ్యుల నామినేషన్లలోనూ నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలోని 2,870 వార్డు­ల­కు 7,893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత సంగారెడ్డిలో 4,311 మంది, సూర్యాపేటలో 4,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డుల విషయంలోనూ ములుగు జిల్లా చివరిస్థానంలో ఉంది. ఇక్కడ 420 వార్డులకు కేవలం 959 మంది మాత్రమే., ఆ తర్వాతి స్థానంలో నారాయణపేట 1,183 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు.  

నామినేషన్ల దాఖలు కానిది ఎక్కడంటే... 
మంచిర్యాల జిల్లాలోని 3 పంచాయతీలతోపాటు 34 వార్డులకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని ఎస్‌ఈసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కొమురంభీమ్‌ జిల్లాలో ఒక సర్పంచ్‌ స్థానంతోపాటు 30 వార్డులకు, నిర్మల్‌ జిల్లాలో ఒక పంచాయతీతోపాటు 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వికారాబాద్‌ జిల్లాలో 19, జనగామ జిల్లాలో 10 వా­ర్డులకు, మరికొన్ని జిల్లాల్లో కూడా కొన్ని వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని ఎస్‌ఈసీ తెలిపింది. 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు