Breaking News

పరిమితి వేలల్లో.. ఖర్చు లక్షల్లో

Published on Sun, 10/05/2025 - 01:30

సాక్షి, హైదరాబాద్‌: జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌.. అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా అనేది నానుడి. గత కొన్నేళ్లలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం ఊహించలేనంతగా పెరిగిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి కూడా అలాగే తయారవుతోంది. స్థాని క ఎన్నికల్లో పోటీ చేయటం అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారుతోంది.

వార్డు సభ్యుడు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలంటే భూము లు ఇతర ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తోంది. ఎన్నికల సంఘం అభ్యర్థులకు విధిస్తున్న వ్యయ పరిమితికి, వాస్తవంగా చేస్తున్న ఖర్చుకు జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌ ఉంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గ్రామ వార్డు సభ్యుడు మొదలు జెడ్పీటీసీ వరకు పోటీచేసే అభ్యర్థుల గరిష్ట ఎన్నికల ఖర్చు వివరాలు చూద్దాం..

గరిష్ట వ్యయపరిమితి (2011 జనాభా లెక్కల ప్రకారం..)
⇒ 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి రూ.30 వేల వరకే ఖర్చు చేయాలి.
⇒ 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో వార్డు సభ్యుడిగా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.50 వేల వరకే ఖర్చు చేయాలి.
⇒ 5 వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.
⇒ 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయతీలో సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.2.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.
⇒ ఎంపీటీసీ అభ్యర్థి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకే ఖర్చు చేయాలి.
⇒  జెడ్పీటీసీ అభ్యర్థి గరిష్టంగా రూ.4 లక్షల వరకే ఖర్చు చేయాలి.

అభ్యర్థులు చేయాల్సినవి...
⇒ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీచేసే వారు ఇద్దరు సాక్షులతో కూడిన తమ స్వీయ ప్రకటన (సెల్ఫ్‌ డిక్లరేషన్‌)ను నామినేషన్‌ పత్రంతో రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి. 
⇒ అభ్యర్థులపై ఒకవేళ క్రిమినల్‌ కేసులు ఉంటే స్వీకరించిన కేసులు (కాగ్జినెన్స్‌ టేకన్‌) మాత్రమే రాయాలి.
⇒ శిక్ష పడిన కేసు వివరాలు రాయాలి.
⇒ అభ్యర్థి లేదా భాగస్వామి, అభ్యర్థిపై ఆధారపడిన వారి చర, స్థిరాస్తులు (విదేశీ ఆస్తులతో సహా) పొందుపరచాలి.

⇒ ఉమ్మడి ఆస్తిలోని వాటాను కూడా తెలపాలి.
⇒ ఉమ్మడిగా కలిగి ఉన్న భూములు, భవనాలు, ఆపార్ట్‌మెంట్‌ వివరాలు వేర్వేరుగా పొందుపరచాలి.
⇒ వ్యవసాయ భూమికి సంబంధిత భూమి సర్వే నంబర్, ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, మొత్తం విస్తీర్ణం పొందుపరచాలి. వారసత్వమా కాదా అనేది కూడా తెలపాలి.
⇒ బాండ్లు,షేర్లు, డిబెంచర్ల విలువ, తత్సంబంధిత కంపెనీ స్టాక్‌ ఎక్సె్చంజీ జాబితాలో ఉంటే ప్రస్తుత మార్కెట్‌ విలువ, జాబితాలో లేని కంపెనీల వివరాలు పుస్తకాలలో పేర్కొన్న ప్రకారం చూపాలి.

⇒ ఆధారపడటం అంటే ఓ వ్యక్తి పూర్తిగా అభ్యర్థి ఆదాయంపైనే ఆధారపడినట్టు అర్థం.
⇒ ప్రతి పెట్టుబడి, ఎంత మొత్తంలో ఆ పెట్టుబడి పెట్టారో వివరాలు తెలపాలి.
⇒ చేతిలో నగదు, అభ్యర్థికి సంబంధించిన నగదు, భార్య/భర్తకు సంబంధించిన నగదు, ఆధారపడిన వారి వద్ద ఉన్న నగదు వివరాలు తెలియజేయాలి.
⇒  అభ్యర్థి, భార్య/భర్త, వారిపై ఆధారపడిన వారి బ్యాంకు ఖాతాలు, వాటిలో ఉన్న మొత్తం నిల్వ, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, అకౌంట్‌ నంబర్లు, ఏదైనా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, టర్మ్‌ డిపాజిట్లు ఉంటే వాటి వివరాలు తెలపాలి.

⇒ అభ్యర్థి, భార్య/భర్త, వారిపై ఆధారపడిన వారికి ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, వజ్రాలు, ఇతర ఆభరణాలు వాటి బరువు ఒక్కొక్కటిగా పేర్కొనాలి.
⇒ అభ్యర్థి, భార్య/భర్తకు సంబంధించిన వృత్తి, వ్యాపార వివరాలు పొందుపరచాలి.
⇒ అభ్యర్థికి సంబంధించిన విదార్హతల సర్టిఫికెట్లు, కోర్సు పూర్తి చేసిన సంవత్సరం, ఇతర వివరాలు ఇవ్వాలి.
⇒ అభ్యర్థుల స్వీయ ప్రకటనను ఇద్దరు సాక్షులతో సంతకాలు చేయించి, వారి పూర్తిపేరు, చిరునామా స్పష్టంగా రాయకపోతే నామినేషన్‌ తిరస్కరణకు గురవుతుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)