Breaking News

తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. ఈ జిల్లాలకు సీఎం రేవంత్‌

Published on Sun, 11/30/2025 - 23:00

తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  పలు వ్యాఖ్యలు చేశారు.ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ముందుకువెళ్తుందని భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ మంత్రులు అందరూ కలిసి  తయారు చేసిన తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ రోడ్డు మ్యాప్‌ను ప్రజల ముందు ఉంచబోతున్నామన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న  సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ పేరుతో డిసెంబర్ 1 నుంచి ఆరవ తేదీ వరకు ఉమ్మడి జిల్లాల వారిగా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.

డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని  మక్తల్ , డిసెంబర్ 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, డిసెంబర్ 3న వరంగల్ ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్ , 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, 5న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట , 6న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఈ ఉత్సవాలకు హాజరవుతారన్నారు.

రాష్ట్రానికి ఐకానిక్ గా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించే ఉత్సవాల్లో  సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డిసెంబర్ 8,9 న ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్ 9న త్రీ మిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా  తెలంగాణను మార్చడానికి భవిష్యత్‌లో తీసుకోబోయే నిర్ణయాలతో పాటు ఎలాంటి అభివృద్ధి చేస్తామో దానికి సంబంధించిన విజన్ డాక్యుమెంటరీని విడుదల చేసి సమాజం ముందు ఉంచుతామన్నారు.


 

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)