Breaking News

రండి.. పెట్టుబడులు పెట్టండి

Published on Thu, 11/06/2025 - 04:27

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్శించేందుకు ప్రజాపాలన–ప్రజావిజయోత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2025’నిర్వహించనుంది. వచ్చే నెల 8,9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలోని మీర్‌ఖాన్‌పేటలో ఈ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్ల కోసం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ అధ్యక్షతన ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. 

సీఎం రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవడంతోపాటు డిసెంబర్‌ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు కావడంతో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ విజన్‌ రైజింగ్‌–2047 డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. ఫ్యూచర్‌ సిటీ సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ను అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు కొత్త ఇండస్ట్రీ, మైనింగ్, ఎడ్యుకేషన్‌ పాలసీలను విడుదల చేస్తారు.  

ఏడుగురితో ప్రత్యేక కమిటీ  
టీజీ ఎస్‌పీడీసీఎల్, జలమండలి, హెచ్‌ఎండీఏ, ఐటీ, ట్రాన్స్‌కో, హౌసింగ్, ట్రాన్స్‌పోర్ట్‌ వంటి పలు ప్రభుత్వ విభాగాల సమన్వయానికి జయేశ్‌రంజన్‌ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు వికాస్‌రాజ్, సంజయ్‌కుమార్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తాని యా, టీజీ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషరఫ్‌ అలీ ఫారూఖీ, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఎంఆర్‌డీసీఎల్‌ ఎండీ ఈవీ నర్సింహారెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. 

ఫార్చ్యూన్‌–500 కంపెనీలకు ఆహ్వానం  
గ్లోబల్‌ సమ్మిట్‌కు ఫార్చ్యూన్‌–500 కంపెనీలకు ఆహ్వానించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం, రీజినల్‌ రింగ్‌రోడ్‌ వంటి కీలక ప్రాజెక్టుల అభివృద్ధి ఎలా ఉంటుందో వివరించనున్నారు. రెండు రోజుల సదస్సులో ఫ్యూచర్‌ సిటీలో పలు ప్రభుత్వ విభాగాలకు భూములను కేటాయించనున్నారు. 

స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్, ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఇలంబర్తి, టీజీఐఐసీ ఎండీ, ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ శశాంక ఆధ్వర్యంలో ఎంఓయూ, అనౌన్స్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతినిధుల భద్రత ఏర్పాట్ల కోసం అదనపు డీజీ డీఎస్‌ చౌహాన్, ఐజీ ఎం.రమేశ్, రాచకొండ కమిషనర్‌ సు«దీర్‌బాబులతో సెక్యూరిటీ అండ్‌ ప్రోటోకాల్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)