Breaking News

వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ​సైబరాబాద్‌లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం

Published on Thu, 02/26/2026 - 10:38

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలువుతున్న 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గచ్చిబౌలిలోని పీఎస్‌ఐఓసీ, ఎస్సీఎస్సీ మీటింగ్ హాల్లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ముందుగానే రద్దీ అంచనా..
ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌కు చెందిన 'ట్రాన్స్‌కాలిటీ' సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ ఏఐ ఆధారిత ట్రాఫిక్ పరిష్కారాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సరికొత్త సాంకేతికత ద్వారా రాజధానిలోని ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి, ఎక్కడ రద్దీ ఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించవచ్చని వివరించారు. దీనివల్ల సిగ్నల్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా నియంత్రించి వాహనాల రాకపోకలను సుగమం చేయవచ్చని తెలిపారు.

​రోడ్డు భద్రతే లక్ష్యం..
నగరంలో రాబోయే మౌలిక సదుపాయాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ట్రాఫిక్ ప్రణాళికలు రూపొందించాలని సీపీ అధికారులను ఆదేశించారు. ఆధునిక ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్ టెక్నాలజీలను వినియోగించడం వల్ల రోడ్డు భద్రత మెరుగుపడటమే కాకుండా సిబ్బంది పనితీరు కూడా పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డీసీపీలు టి. అన్నపూర్ణ, ఐ. రంజన్ రతన్ కుమార్, ఏడీసీపీ హనుమంతరావు, ఎస్‌సీఎస్‌సీ సీఈఓ నవేద్ మరియు ఆస్కి/ ASCI ప్రతినిధులు పాల్గొన్నారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు