Breaking News

డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు చేసిన మన ఈగల్‌ టీం

Published on Mon, 12/01/2025 - 02:18

సాక్షి, న్యూఢిల్లీ: సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్నట్లు ఉంది ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసుల తీరు. అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా ఆటలను కట్టడి చేసిన తెలంగాణ ఈగల్‌ టీం పోలీసులు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ వాడే వాళ్లకు, దేశం నలుమూలల నుంచి తెలంగాణకు డ్రగ్స్‌ను సరఫరా చేసే వారికి దేశ రాజధాని వేదికగా భయం పుట్టించారు. నెలల పాటు నిద్రాహారాలు లేకుండా కష్టపడి కేసు ను ఛేదించిన మన పోలీసుల క్రెడిట్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ చోరీ చేస్తోంది.  

కంటిపై కునుకులేదు: దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించిన తెలంగాణ ఈగల్‌ టీం.. దీనిని అరికట్టేందుకు నడుం బిగించింది. ఇందుకోసం 105 మంది పోలీసులను ఫీల్డ్‌లో పెట్టింది. మూడు నెలల పాటు ఢిల్లీతోపాటు యూపీలోని నోయిడాను జల్లెడ పట్టింది. ఒక్కో ఫోన్‌ నంబర్, ఒక్కో బ్యాంకు ఖాతా ఆధారంగా డ్రగ్‌ సరఫరా ముఠా జాడను కనుగొంది. వారు డ్రగ్స్‌ ఎలా సరఫరా చేస్తున్నారో   చూసేందుకు పగలు రాత్రీ అహర్నిశలు కష్టపడింది. ఢిల్లీ, నోయిడా వీధుల్లో మారువేషంలో రెక్కీ నిర్వహించింది. ఈగల్‌ డైరెక్టర్‌ సైతం పురవీధుల్లో తిరిగారు. అన్నీ నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్‌ను ప్రారంభించారు. దీంతో కొద్దిరోజుల క్రితం ఈ డ్రగ్‌ ముఠా ఆటకు చెక్‌ పెట్టారు. ఇంత కష్టపడిన వీరికి మాత్రం ఏవిధమైన ప్రతిఫలం దక్కలేదని చెప్పడంలో సందేహం లేదు.

ఈగల్‌ క్రెడిట్‌ చోరీ
స్థానికంగా ఆపరేషన్‌ చేస్తున్నందుకు ఈగల్‌ టీం ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ సాయం కోరింది. వీరి పర్యవేక్షణ, సహాయ, సహకారాలతో ఆపరేషన్‌ చేసింది. ఈ ఆపరేషన్‌లో 50 మందికి పైగా అదుపులోకి తీసుకోగా.. రూ.12 కోట్ల విలువైన డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదంతా తమవల్లే సాధ్యమైందని, తాము లేకపోతే ఇంతపెద్ద నెట్‌వర్క్‌ను చేధించడం కష్టమయ్యేదంటూ ఢిల్లీ పోలీసులు గొప్పలు చెప్పుకుంటున్నారు. మీడియా సమావేశంలో ఈగల్‌ టీం ఎస్పీ సీతారామ్‌ ఈ ఆపరేషన్‌ను వివరిస్తున్న సమయంలో తెలుగు మీడియా కొన్ని ప్రశ్నలు వేయగా.. ఆయన సమాధానం చెబుతున్నారు. 

ఇదే సమయంలో పక్కనే ఉన్న ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ జాయింట్‌ సీపీ సురేంద్ర కుమార్‌ సీటులో నుంచి పదేపదే పైకి లేవడంతో.. సీతారామ్‌ సమాధానాలు చెప్పలేక ఇబ్బంది పడ్డారు. ఈగల్‌ టీం కష్టాన్ని చెప్పుకోనివ్వకపోవడం మరింత నిరాశ, నిస్పృహలకు దారితీస్తోంది. ఎంతో కాలంగా ఢిల్లీలో డ్రగ్‌ దందా నడుస్తుంటే పట్టుకోలేని స్థానిక పోలీసులు తెలంగాణ పోలీసులు వచ్చి రెక్కీ వేసి, తమకు సహకరించాలని ఆపరేషన్‌లో వెంటపెట్టుకున్నారు. ఇంత చేసినా క్రెడిట్‌ను ఈగల్‌ టీంకు ఇవ్వకుండా వాళ్లే కొట్టేయాలని భావించడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని మన పోలీసులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.  

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)