Breaking News

పంచాయతీ పోరుకు సై

Published on Wed, 11/26/2025 - 01:45

సాక్షి, హైదరాబాద్‌: పల్లెల్లో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 564 మండలాల్లో 12,728 గ్రామ పంచాయతీల్లోని 12,728 సర్పంచ్, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు (32 జీపీలు, 292 వార్డులు మినహా) మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చేనెల 11న తొలి, 14న రెండో, 17న మూడో విడత జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఐ.రాణీకుముదిని మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేశారు.

ఏ దశకు ఆ దశ ఎన్నిక ముగియగానే అదే రోజు సాయంత్రం సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లు లెక్కించాక విజేతలను ప్రకటించనున్నారు. ఈ షెడ్యూల్‌ జారీతోనే 31 గ్రామీణ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమల్లోకి వచ్చిందని ఆమె తెలియజేశారు. ఈ ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహిస్తుండగా, బ్యాలెట్‌ పత్రాల్లో ‘నోటా’ (‘నన్‌ ఆఫ్‌ద అబౌవ్‌) గుర్తును కూడా ముద్రించనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ డా.జి.సృజన, అదనపు డీజీపీ మహేశ్‌ భగవత్, ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరందంలతో కలిసి రాణీకుముదిని నోటిఫికేషన్‌ విడుదల చేశారు.  

ప్రత్యేక కాల్‌సెంటర్‌ 
హైకోర్టులో ఉన్న వివిధ కేసుల్లో స్టే విధించిన కారణంగా ములుగు జిల్లాలోని మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలు, కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రాపూర్‌ పంచాయతీలు, ఖమ్మం జిల్లా ఎన్నూరు మండంలోని 4 జీపీలు, పెనుబల్లి మండలంలోని ఒక గ్రామపంచాయతీకి, అలాగే వీటిలోని మొత్తం 292 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించడంలేదని కమిషనర్‌ రాణీకుముదిని తెలిపారు. గత సెప్టెంబర్‌ 29న ఐదు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ విడుదల చేసిన షెడ్యూల్‌ను నిలుపుదల చేసినట్టు చెప్పారు.

ప్రస్తుతం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల కోసం రీనోటిఫికేషన్‌ విడుదల చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాల్లో ఎన్నికల పరిశీలకులను నియమించామని, ఎన్నికల ఉల్లంఘనలపై వారు ఎప్పటికప్పుడు తమకు నివేదికలు పంపిస్తారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల కోసం ఈసారి కొత్తగా ‘గ్రీవెన్స్‌ మాడ్యూల్‌’ను ఏర్పాటు చేశామని, త్వరలో అందుబాటులోకి తెస్తున్న యాప్‌ ద్వారా ఫిర్యాదులు, అభ్యంతరాలు వంటివి స్వీకరిస్తామన్నారు. ఈ ఎన్నికల నిమిత్తం ఎస్‌ఈసీ కార్యాలయంలో 9240021456 నంబర్‌తో కాల్‌సెంటర్‌ కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 

నామినేషన్లకు మూడు రోజులు 
గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సవరించిన రిజర్వేషన్లను ప్రభుత్వం తమకు సమరి్పంచిందని రాణీ కుముదిని తెలిపారు. దీంతో పంచాయతీలకు రెండో సాధారణ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, జిల్లాలు–గ్రామపంచాయతీల వారీగా రిజర్వేషన్లు తదితర అంశాలను గెజిట్‌లలో ప్రచురించినట్టు చెప్పారు. గ్రామీణ స్థానిక సంస్థల పోస్టులకు ఖాళీలు ఏర్పడడంతో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు.

ఒక్కో దశను 15 రోజుల్లోగా ముగించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఒక్కో దశకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉన్నట్టుగా వెల్లడించారు. ఆయా తేదీలను బట్టి ఎక్కడికక్కడ రిటరి్నంగ్‌ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేస్తారని ప్రకటించారు. ఈ ఎన్నికల నోటీఫికేషన్‌ జారీచేసిన రోజు కలుపుకుని మూడురోజులు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుందన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో, శాంతియుతంగా, నియమ నిబంధనలకు లోబడి ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. 

ఎన్నికలు జరిగే స్థానాలివీ
మొత్తం జిల్లాలు         : 31 
రెవెన్యూడివిజన్లు       : 72 
మండలాలు              : 564 
పంచాయతీలు           :12,728 
వార్డుల సంఖ్య            :1,12,242 
పోలింగ్‌ కేంద్రాలు         :1,00,000కు పైగా 

గ్రామీణ ఓటర్లు 
పురుషులు    :81,42,231 
మహిళలు     :85,12,455 
ఇతరులు      :500 
మొత్తం         :1,66,55,186 
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు