Breaking News

‘వైద్యం’లో తెలంగాణ నంబర్‌ వన్‌ 

Published on Mon, 08/14/2023 - 02:16

గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్‌): వైద్యం, వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్యవిద్యలో రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉండేదని, నిజామ్, బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులే ఉండేవని గుర్తుచేశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో వైద్యరంగంలో ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. సికింద్రాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజీలో ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని హరీశ్‌ అన్నారు. లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్‌ సీట్లతో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నామని, అలాగే పీజీలో 8 సీట్లతో రెండవ స్థానంలో ఉన్నామని తెలిపారు. ధాన్యం ఉత్పత్తితో పాటు వైద్యులను తయారు చేయడంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. ఎంబీబీఎస్‌ ఫీజులు రాష్ట్రంలోనే తక్కువని, వైద్య విద్యార్థులకు అందించే స్టైఫండ్‌ అన్ని రాష్ట్రాలకంటే ఇక్కడే ఎక్కువ అని చెప్పారు. ప్రభుత్వ వైద్యులకు పీజీలో రిజర్వేషన్‌ సదుపాయం కల్పి స్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.

నగరం నలుదిక్కుల నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. హైదరాబాద్‌ గ్లోబల్‌ హెల్త్‌ హబ్‌గా మారిందని, ఇతర దేశాలకు చెందినవారంతా వైద్యసేవలు, చికిత్సల కోసం హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారని తెలిపారు. త్వరలోనే గాంధీ ఆస్పత్రిలో అవయవ మార్పిడి, ఫెర్టిలిటీ, ఎంసీహెచ్‌ భవనాలు, అధునాతన అపరేషన్‌ థియేటర్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.

కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు, సదుపాయాలు కల్ప0చామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్లు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌ అందజేశారు. డీఎంఈ రమే‹Ùరెడ్డి, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణమోహన్, పలువురు హెచ్‌ఓడీలు, ఆర్‌ఎంఓలు, వైద్యులు, వైద్యవిద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)