Breaking News

TS: పరిహారం కోసం వెళ్లిన పోశన్నకు షాక్‌

Published on Fri, 11/04/2022 - 15:23

క్రైమ్‌: ఉన్నట్లుండి ఇంటి బయట కొట్టంలో ఉన్న గొర్రెలు మాయమైపోతూ వచ్చాయి. చివరకు ఓ కొండచిలువ వాటిని మింగేసిందని తెలుసుకున్నాడు ఆ గొర్రెల కాపరి. నష్టపరిహారం కోరుతూ అతను ఫారెస్ట్‌ అధికారులను సంప్రదించాడు. అయితే ఉల్టా అతని మీదే కేసు పెడతామని ఫారెస్ట్‌ అధికారులు చెప్పడంతో షాక్‌ తిన్నాడు. మంచిర్యాల జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కావాల్‌ గ్రామానికి చెందిన పోశన్న.. ఇంటి ఆవరణలోనే సాదుకుంటున్న  నాలుగు గొర్రెలు కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. వారం రోజుల్లో ఆ నాలుగు ఒక్కొక్కటిగా అదృశ్యమైపోతూ వచ్చాయి. ఈ క్రమంలో దొంగల పనిగా భావించిన ఆ కుటుంబం ఒక కన్నేసింది. అయితే.. అక్టోబర్‌ 30వ తేదీన పోశన్న భార్య ఇల్లు ఊడుస్తున్న టైంలో ఇంటి ఫెన్సింగ్‌లో ఓ భారీ కొండచిలువ చిక్కుకుని కనిపించింది. 

దీంతో గొర్రెలను మింగింది కొండచిలువనేనని నిర్ధారించుకుని.. కోపంతో ఊరి జనం సాయంతో దానిని గొడ్డళ్లతో నరికి చంపేశాడు పోశన్న. గొర్రెలు బతికే ఉంటాయన్న ఆశతో దాని కడుపు చీల్చి చూశాడు. అయితే.. అందులో గొర్రెల మృతదేహాలు కనిపించాయి. దీంతో పోశన్న అటవీ అధికారులను నష్టపరిహారం కోసం సంప్రదించాడు. అయితే.. నష్టపరిహారానికి బదులు.. కొండచిలువను చంపిన నేరానికి వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని అధికారులు చెప్పడంతో పోశన్న కంగుతిన్నాడు.

Videos

మెల్‌బోర్న్‌లో YS జగన్ జన్మదిన వేడుకలు

ఈ సంక్రాంతికి రవితేజ మార్క్ మూవీ

వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ షాక్.. 17 ఏళ్ల జైలు శిక్ష

వీడో కొత్త రకం సైకో.. పిల్లలు కనిపిస్తే చాలు!

మొన్న ఎగ్ బిర్యాని.. నిన్న ఎగ్స్.. తిరుమలలో వరుస అపచారాలు

జగన్ పై పవన్ వ్యాఖ్యలు.. సీదిరి అప్పలరాజు దిమ్మతిరిగే కౌంటర్

మరదలితో ఎఫైర్..! మీర్‌పేట మాధవి కేసులో షాకింగ్ నిజాలు

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు రాజ్యాంగబద్దమేనా?

మునిగిన దుబాయ్.. బయటకు రావొద్దంటూ హెచ్చరిక

Photos

+5

క్రిస్మస్ వేళ.. ఏపీలోని ఈ ప్రసిద్ధ చర్చి గురించి తెలుసా? (ఫొటోలు)

+5

కలర్‌ఫుల్‌ చీరలో కృతి శెట్టి.. ఫ్యాన్స్‌ కోసం ఫోటోలు షేర్‌ చేసిన బ్యూటీ

+5

ముచ్చట గొలిపే ముత్యాల ముగ్గులు.. మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

‘మోగ్లీ 2025’ థ్యాంక్స్‌ మీట్‌..ముఖ్య అతిథిగా హీరో సాయిదుర్గా తేజ్‌ (ఫొటోలు)

+5

‘హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌’ ప్రారంభం (ఫొటోలు)

+5

#INDvsSA : టి20లో భారత్‌ గెలుపు ...సిరీస్‌ టీమిండియా సొంతం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కిదాంబి శ్రీకాంత్‌- శ్రావ్య వర్మ దంపతులు (ఫొటోలు)

+5

దుబాయ్‌లో దంచికొట్టిన వర్షం.. బుర్జ్‌ ఖలీఫాను తాకిన పిడుగు (ఫొటోలు)

+5

అడివి శేష్‌ ‘డెకాయిట్‌’ చిత్రం టీజర్‌ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి సహస్ర ఘటాభిషేకం (ఫొటోలు)