Breaking News

తెలంగాణలో మద్యం విక్రయాల సునామీ!

Published on Thu, 01/01/2026 - 14:50

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో న్యూఇయర్‌ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. ఫలితంగా న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా మద్యం విక్రయాలు కొత్త రికార్డులు సృష్టించాయి. ఈ నెల 25వ తేదీ నుంచి నిన్నటి వరకు మద్యం అమ్మకాల విలువ రూ.1350 కోట్లకు చేరింది. ముఖ్యంగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లోనే దాదాపు రూ.1000 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం.  

 29వ తేదీ రూ.280 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా..30వ తేదీన రూ.380 కోట్లు,31వ తేదీన రూ.315 కోట్ల అమ్మకాలతో.. మొత్తం మూడు రోజుల్లోనే 8.30 లక్షల కేసుల లిక్కర్‌, 7.78 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. 

రాష్ట్రంలో న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, పార్టీలు, వ్యక్తిగత వేడుకల్లో మద్యం వినియోగం అధికంగా కనిపించింది. మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభించింది. ఎక్సైజ్‌ శాఖ గణాంకాల ప్రకారం, ఈ మూడు రోజుల్లోనే వందల కోట్ల రూపాయల పన్ను ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరింది.

ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో మద్యం అమ్మకాలు పెరగడం సాధారణమే. అయితే ఈసారి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడం గమనార్హం. ఇది ప్రజల వినియోగ ధోరణిని, వినోదం పట్ల ఉన్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)