Breaking News

హైడ్రా, ఈగల్‌ తరహాలో ‘ఫుడ్‌ సేఫ్టీ స్పెషల్‌ వింగ్‌’

Published on Wed, 06/17/2026 - 19:16

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్‌సేఫ్టీపై స్పెషల్‌ వింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీనియర్‌ ఐఏఎస్‌ నేతృత్వంలో ఫుడ్‌సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేస్తారు. డీపీఆర్‌ రెడీ చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. హైడ్రా, ఈగల్‌ తరహాలో ఫుడ్‌ సేఫ్టీ స్పెషల్‌ వింగ్‌ ఉండనుంది. ఆహార కల్తీ, తనిఖీలు, సేఫ్టీపై చర్యలు తీసుకోనుంది ఈ వింగ్‌. త్వరలోనే విధివిధానాలతో పూర్తి వివరాలు క్యాబినెట్‌ ముందుకు రానున్నాయి.

కాగా, ఫుడ్ సేఫ్టీపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్‌ సైడ్‌ ఆహారం తయారీ, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగం సమయంలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదు. దీనివల్ల ఆహారం కలుషితం, బ్యాక్టీరియా, వైరస్‌లు, రసాయనాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనిని నివారించడంలో ఫుడ్‌ సేఫ్టీ స్పెషల్‌ వింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

పరిశుభ్రమైన ఆహారం ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలు ఫుడ్ సేఫ్టీలో భాగం. నాణ్యమైన ఆహారాన్ని అందించే బాధ్యతను వ్యాపార సంస్థలు మరుస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తే ఆహార కల్తీ బాధలు, అంటువ్యాధులు తగ్గి సమాజం మరింత ఆరోగ్యంగా ఉంటుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)