Breaking News

మార్చి 12న యూత్‌ కార్నివాల్‌ ‘ప్రోస్ట్‌’

Published on Sun, 02/26/2023 - 04:04

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్, స్టూమాగ్జ్‌ సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే నెల 12న ఎల్‌బీ స్టేడియం వేదికగా అతిపెద్ద యూత్‌ కార్నివాల్‌ ‘ప్రోస్ట్‌’ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఆవిష్కరించారు. తెలంగాణలో తొలిసారిగా నిర్వహించనున్న ఈ కార్నివాల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న 15 వేల మంది విద్యార్థులను భాగస్వాములను చేయనున్నారు.

ఈ కార్నివాల్‌లో అధునాతన సాంకేతికత, స్వదేశీ ఆవిష్కరణలను ప్రభావితం చేసే వినూత్న ఆలోచనా విధానాలను, టెక్నాలజీ సంబంధిత అంశాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా స్టూమాగ్జ్‌ వ్యవస్థాపకుడు శ్రీచరణ్‌ లక్కరాజు మాట్లాడుతూ..ఎమర్జింగ్‌ టెక్నాలజీలో భవిష్యత్‌ అవకాశాలను అన్వేషించే వారికి స్టూమాగ్జ్‌ ‘స్టూడెంట్‌ ట్రైబ్‌ ఇనిషియేటివ్‌’ సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి  ప్రోస్ట్‌ కార్నివాల్‌ రూపొందించినట్లు తెలిపారు. యువతలో ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేటివ్‌ సెల్‌ కృషి చేస్తుందని చీఫ్‌ ఇన్నోవేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శాంత తోటం అన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)