Breaking News

తెలంగాణ కాంగ్రెస్‌.. అన్నీ ఆ ఆరుగురే! త్వరలో జాబితా విడుదల?      

Published on Wed, 01/18/2023 - 02:18

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగ­త పని విభజన ప్రక్రియ ఊపందుకుంది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లతో పాటు ఇటీవల పార్టీ ఉపాధ్య­క్షులు, ప్రధాన కార్యదర్శులుగా నియమి­తులైన వారికి లోక్‌సభ నియోజకవర్గాల వారీగా బాధ్య­తలు అప్పగించేందుకు ముమ్మర కసరత్తు జరుగు­తోంది. ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కు పూర్తి స్థాయి బాధ్య­తలు పార్టీ అప్పజెప్పనుంది.

వారికి తోడుగా ఇద్దరు ఉపాధ్యక్షు­లను కూడా నియమించనుంది. ఈ క్రమంలోనే ఏ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులకు ఏ పార్లమెంటు నియోజకవర్గం అప్పగించాలన్న దాని­పై టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తు­న్నారు. ఇక టీపీసీసీ ప్రధాన కార్యదర్శులకు అసెంబ్లీ నియోజక­వర్గాల బాధ్యతలు అప్పగించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ప్రధాన కార్యదర్శిని సమన్వయకర్తగా నియమించాలని, ఒక పార్లమెంటు పరిధిలోనికి వచ్చే ముగ్గురు అసెంబ్లీ నియోజక­వర్గాల సమన్వయకర్తలతో పాటు ఒక వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఇద్దరు ఉపాధ్యక్షులు కలిపి మొత్తం ఆరుగురు నాయకులను ఒక లోక్‌సభ నియో­జకవర్గంలో రంగంలోకి దింపనుంది. 

ఎక్కడా సమన్వయ లోపం లేకుండా..
గాంధీభవన్‌ నుంచి రాష్ట్రంలోని ప్రతి పోలింగ్‌ బూత్‌ వరకు ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసేందుకు ఈ పని విభజన చేపడుతున్నామని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, స్థానిక నాయకులకు తోడుగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పని చేస్తారని చెబుతున్నాయి. ఒకవేళ వీరిలో ఎన్నికల్లో పోటీ చేసే నేతలున్నట్టైతే వారి స్థానాలకు వెళ్లిపోతారని, మిగిలిన వారంతా ఆ పార్లమెంటు స్థానం పరిధిలోనే ఎన్నికలు పూర్తయ్యేంతవరకు పనిచేస్తారని తెలిపాయి.

కిందిస్థాయి నుంచి పైవరకు అన్ని వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతతో పాటు సమన్వయం, పర్యవేక్షణ, పార్టీ కార్యక్రమాల అమలు లాంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ ఇన్‌చార్జులకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థికి అనుగుణంగా ఎన్నికల సమయంలో పనిచేయించడంతో పాటు ఎన్నికలకు ముందు ఆ నియోజకవర్గంలో పార్టీ కేడర్‌ను ఉత్సాహపరిచే బాధ్యతను ఈ ఇన్‌చార్జులు తీసుకుంటారని, అంతర్గత సమస్యల నుంచి ఎన్నికల సంఘం సూచనల వరకు అన్ని అంశాల్లోనూ ఈ ఆరుగురు నేతలు కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. 

ఎన్నికలు ముగిసే వరకు అక్కడే..
స్థానిక నేతలు, పార్టీ తరఫున అసెంబ్లీ.. లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులతో కలిసి 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికలు ముగిసేంతవరకు ఈ ఆరుగురు నేతలు వారికి కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గంలోనే పని చేయనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ జాబితాను కూడా త్వరలోనే అధికారికంగా విడుదల చేయనున్నట్టు సమాచారం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)