Breaking News

సర్వ హంగులు.. సకల సదుపాయాలు...

Published on Tue, 08/19/2025 - 19:21

సాక్షి, సిటీబ్యూరో : స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, పరిపాలనకు ఇబ్బంది లేకుండా ఇంటిగ్రేటెడ్‌ సబ్‌–రిజిస్ట్రార్‌ ఆఫీసుల ఏర్పాటుకు స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేష‌న్‌ శాఖ చర్యలకు ఉపక్రమించింది. గ్రేటర్‌ పరిధిలో అవసరమైన ప్రాంతాల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించి సమీకృత భవన సముదాయాలు నిర్మించాలని నిర్ణయించింది.  

11 సమీకృత భవన సముదాయాలు.. 
గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల పరిధిలోని 39 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను 11 సమీకృత భవనాల పరిధిలోకి తీసుకొచ్చేందుకు స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేష‌న్‌ శాఖ చర్యలు చేట్టింది. తొలివిడతలో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్‌ ల్యాండ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (తాలిమ్‌) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్‌ సబ్‌–రిజిస్ట్రార్‌ భవన సముదాయాన్ని నిర్మించనుంది. అందులో రంగారెడ్డి ఆర్వో ఆఫీస్, గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ కార్యాలయాల కార్యాకలాపాలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తోంది. ఈ ఇంటిగ్రేటెడ్‌ సబ్‌–రిజిస్ట్రార్‌ ఆఫీసుల భవన సముదాయానికి ఈ నెల 20న సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా శంకుస్ధాపన జరిగే విధంగా రంగం సిద్దం చేసింది.

ఇంకా ఎక్కడెక్కడ నిర్మిస్తారంటే..   
నగర శివారులోని కోహెడలో అబ్దుల్లాపూర్, పెద్ద అంబర్‌ పేట్, హయత్‌నగర్, వనస్ధలిపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల కోసం ఇంటిగ్రేటెడ్‌ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. 

మంకాల్‌లో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల కోసం.. 
బోడుప్పల్‌ లో ఆర్వో మేడ్చల్, కుత్బుల్లాపూర్, కీసర, శామీర్‌పేట్‌  కార్యాలయాల కోసం 
కండ్లకోయలో ఉప్పల్, నారపల్లి, కాప్రా, ఘట్‌కేసర్, మల్కాజ్‌గిరికి.. 
బంజారాహిల్స్‌లో బంజారాహిల్స్, ఎస్‌.ఆర్‌. నగర్, గొల్కోండ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల కోసం.. 

మలక్‌పేటలో ఆజంపూరా, చార్మినార్, దూద్‌బౌలి సబ్‌ రిజిస్ట్రార్‌ ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయాలు పనిచేసే విధంగా ఇంటిగ్రేటెడ్‌ భవన సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. 

చ‌ద‌వండి: రైలు ప్ర‌యాణికుల‌కు కీల‌క అప్డేట్‌.. గ‌మ‌నించారా?

మరో పదమూడు సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాల కోసం నాలుగు చోట్ల ఇంటిగ్రేటెడ్‌ భవనాల కోసం స్ధలాలను గుర్తింపు కోసం రిజి్రస్టేషన్‌శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు