Breaking News

గ్లోబల్‌ మెడికల్‌ హబ్‌గా హైదరాబాద్‌ 

Published on Mon, 09/25/2023 - 03:50

హఫీజ్‌పేట్‌(హైదరాబాద్‌): హైదరాబాద్‌ మహానగరం ‘గ్లోబల్‌ మెడికల్‌ హబ్‌’గా రూపొందిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.  నగరం ఇప్పటికే ఫార్మాహబ్‌గా, వ్యాక్సిన్‌ హబ్, ఐటీ హబ్‌గా గుర్తింపు సాధించిందని ఆయన గుర్తు చేశారు. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్కు ఎదురుగా అరీట్‌ ఆస్పత్రిని మంత్రి హరీశ్‌రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో హైదరాబాద్‌లో మెడికల్‌ టూరిజం బాగా అభివృద్ధి చెందుతోందన్నారు.

దీంతో ట్యాక్సీ డైవర్లకే కాకుండా డాక్టర్లు, టెక్నీషియన్లు, వైద్య సిబ్బందికి పనులు పెరగడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వైద్య చికిత్స కోసం నగరానికి వస్తున్నారన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు పేద, మధ్యతరగతి వారికి తక్కువ ధరకే వైద్యం అందుబాటులో ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా వారు చర్యలు చేపట్టాలని కోరారు. హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయస్థాయి అరీట్‌ ఆస్పత్రి అందుదాటులోకి రావడం సంతోషించదగ్గ విషయమన్నారు.

అరీట్‌ ఆస్పత్రుల చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఆస్పత్రి సేవలు పొందడంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడం, విశ్వసనీయ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. మేనేజింగ్‌ డైరెక్ట వాసుగుత్తా మాట్లాడుతూ అరీట్‌ ఆస్పత్రిలో ఆరోగ్య సంరక్షణకు మించిన సంరక్షణ ఉంటుందన్నారు. అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో తీసుకొచ్చామని చెప్పారు ఈ కార్యక్రమం అరీట్‌ ఆస్పత్రుల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రాజు, డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ వేముల తదితరులు పాల్గొన్నారు.

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)