Breaking News

కేటీఆర్‌ పిటిషన్‌..రేపే హైకోర్టు తుది తీర్పు

Published on Mon, 01/06/2025 - 20:40

సాక్షి,హైదరాబాద్‌:ఫార్ములా-ఈ రేసుల కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‍క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం(జనవరి7) ఉదయం తుది తీర్పివ్వనుంది. ఈ కేసులో పూర్తి వాదనలు విన్న కోర్టు తీర్పు ఇప్పటికే రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. తుది తీర్పు వచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు కూడా కోర్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 

ఈ కేసులో కేటీఆర్‌ ఏ1గా ఉన్నారు. హైకోర్టు ఒకవేళ ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేస్తే కేటీఆర్‌కు శాశ్వత ఊరట లభించినట్లవుతుంది.మరోవైపు ఈ కేసులో గురువారం(జనవరి9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ సోమవారం మళ్లీ నోటీసులిచ్చింది. సోమవారం కేసు విచారణ కోసం బంజారాహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి కేటీఆర్‌ వెళ్లారు. న్యాయవాదిని విచారణకు అనుమతించమని పోలీసులు చెప్పడంతో కేటీఆర్‌ అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చేశారు. 

ఈడీ విచారణకు రాలేను.. సమయం కావాలి: కేటీఆర్‌ 

ఫార్ములా-ఈ కేసులో మంగళవారం(జనవరి7) విచారణకు రావాలని కేటీఆర్‌కు ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు రాలేనని, తనకు సమయం కావాలని ఈడీని కేటీఆర్‌ కోరారు.క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ అయినందున విచారణకు రాలేనని కేటీఆర్‌ సమాధానమిచ్చారు. 

ఇదీ చదవండి: రేవంత్‌ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)