Breaking News

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనికి బిగ్‌ షాక్‌.. హైకోర్టు ఝలక్‌

Published on Mon, 12/09/2024 - 11:25

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వంపై ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ సందర్భంగా రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఆయనకు 30 లక్షలు జరిమానా విధించింది.

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వం విషయంలో రమేష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పదిన్నర సంవత్సరాల పాటు ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనల సందర్బంగా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఆయన పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తున్నట్టు తెలిపింది. రమేష్‌ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.. ఫేక్‌ డాక్యుమెంట్స్‌ సమర్పించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.

జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని కోర్టు తెలిపింది. దీంతో, చెన్నమనేనికి రూ.30 లక్షలు జరిమానా విధించింది. జరిమానాలో రూ.25 లక్షలు కాంగ్రెస్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఇవ్వాలని తెలిపింది. మిగిలిన రూ.5లక్షలను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశం. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేనికి సూచించింది. 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)