Breaking News

గ్రూప్‌-1 ర్యాంకర్లకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణ హైకోర్టులో టీజీపీఎస్సీకి భారీ ఊరట

Published on Wed, 09/24/2025 - 12:26

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌-1 మెయిన్స్‌ విషయంలో టీజీపీఎస్సీకి (TGPSC) తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ర్యాంకులను రద్దు చేస్తూ.. మెయిన్స్‌ పేపర్లను మళ్లీ దిద్దాలన్న సింగిల్‌ బెంచ్‌ తీర్పును బుధవారం డివిజన్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది. దీంతో గ్రూప్‌-1 నియామకాలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది.

గ్రూప్‌-1 ర్యాంకర్లకు ఊరట ఇస్తూ నియామకాలు జరుపుకోవచ్చని.. అయితే ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌  స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే నెలకి వాయిదా వేసింది. 

గ్రూప్‌-1 మెయిన్స్‌(Group 1 Exam) ర్యాంకింగ్‌లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాల నడుమ దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు..  ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈ నెల 9వ తేదీన సంచలన తీర్పు ఇచ్చింది. తిరిగి రీవాల్యూయేషన్‌ నిర్వహించాలని, కుదరకుంటే రీ ఎగ్జామ్‌ కండక్ట్‌ చేయాలంటూ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు 8 నెలల గడువు విధించింది. ఈ తీర్పుతో ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా.. మరోవైపు టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ రిట్‌ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును అసంబద్ధంగా అడ్వొకేట్‌ జనరల్‌ వాదించారు. 14 ఏళ్ల తర్వాత గ్రూప్‌-1 నిర్వహించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది. గ్రూప్‌-1 నిర్వహణ రూల్స్‌లో.. రీవాల్యూయేషన్‌ అనేది లేదు. కేవలం రీకౌంటింగ్‌ మాత్రమే ఉంది. కాబట్టి ఈ తీర్పు సహేతుకం కాదు అని డివిజన్‌ బెంచ్‌(Telangana High Court Division Bench) దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న డివిజన్‌ బెంచ్‌.. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే విధిస్తూ నియమకాలు జరుపుకోవచ్చని క్లియరెన్స్‌ ఇచ్చింది.

ఇదీ చదవండి: కాళేశ్వరంతో నాకేం సంబంధం లేదు-స్మితా సబర్వాల్‌

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)