Breaking News

‘మెట్రో’ విస్తరణపై మీ వైఖరి చెప్పండి

Published on Fri, 02/28/2025 - 05:36

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ నుంచి శంషాబాద్‌ వరకు ప్రభుత్వం చేపడుతున్న మెట్రో రైలు విస్తరణ పనులను ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వైఖరి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాలు సమయం కావాలని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోరడంతో సమ్మతిస్తూ విచారణ ఏప్రిల్‌ 3కు వాయిదా వేసింది. సర్కార్‌ దాఖలు చేసే కౌంటర్‌పై ఆలోగా పిటిషనర్‌ రిజాయిండర్‌ కూడా వేయాలని స్పష్టం చేసింది.

ఎంజీబీఎస్‌ నుంచి శంషాబాద్‌ వరకు మెట్రో రైలు విస్తరణ పనులను ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ యాక్ట్‌ పబ్లిక్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ రహీంఖాన్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు. మెట్రో విస్తరణతో పరిసర ప్రాంతాల్లోని చరిత్రాత్మక కట్టడాలపై ప్రభావం పడుతుందని, చార్మినార్, ఫలక్‌నుమా, దారుల్‌షిఫా లాంటి కట్టడాలకు ప్రమాదం వాటిల్లనుందన్నారు.

చరిత్రాత్మక కట్టడాల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై పురావస్తు శాఖ, పర్యావరణ, ఆయారంగ నిపుణులతో అధ్యయనం చేయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఏసీజే జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ రేణుక యారా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని సర్కార్‌ తరఫు న్యాయవాది కోరడంతో అనుమతించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)