హైదారాబాద్‌లో వినాయకుని నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Published on Fri, 09/08/2023 - 15:48

సాక్షి, హైదరాబాద్‌: హైదారాబాద్‌లో వినాయకుని నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదని తెలిపింది. పీవోపీ వినాయక విగ్రహాల నిమజ్జనంపై గతేడాది ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.

కాగా పీవోపీ విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని గతేడాది హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. పీవోపీ విగ్రహాలు ప్రత్యేక కృత్తిమ కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. అయితే గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇంకా అమల్లోనే ఉన్నాయని హైకోర్టు తెలిపింది.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై నిషేధం ఎత్తివేయాలన్న తయారీదారుల పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్ర పీసీబీ నిబంధనలు కొట్టివేయాలని వినాయక విగ్రహ తయారీదారులు తమ పిటిషన్‌లో కోరారు. గతేడాది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారని న్యాయవాది వేణుమాధవ్ తెలిపారు. అయితే ఆధారాలతో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తే చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 25కి వాయిదా వేసింది. 



చదవండి: కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)