Breaking News

మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

Published on Fri, 01/27/2023 - 20:11

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ ఫీజులకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంటూ రాష్ట్ర మంత్రి, మమతా ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ పువ్వాడ అజయ్‌ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 17వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దని, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన మేరకే వసూలు చేయాలని పలు కాలేజీలను ఆదేశిస్తూ ఓ రిట్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు 2022లో ఉత్తర్వులు ఇచ్చింది.

ఒకవేళ అధిక ఫీజు వసూలు చేస్తే దాన్ని తిరిగి ఇచ్చేయాలని స్పష్టంచేసింది. అలాగే విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా ఇచ్చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను మమతా కాలేజీ యాజమాన్యం పాటించకపోవడంతో వరంగల్‌కు చెందిన డాక్టర్‌ నిఖిల్‌ గుర్రపు కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది సామ సందీప్‌రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను మమతా కాలేజీ పలు కాలేజీలు కావాలనే పాటించలేదని.. దీంతో విద్యార్థులు అధిక ఫీజు చెల్లించాల్సి వచ్చిందన్నారు. వెంటనే ఆ ఫీజు తిరిగి ఇచ్చేలా కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. మంత్రి పువ్వాడకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది.   

చదవండి: సాహితీ ఇన్‌ఫ్రా పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)